News

పాకిస్తాన్ లో ఘనంగా నవరాత్రి వేడుకలు

180views

దేశంలో శరన్నవరాత్రి వేడుకలను మనం ఘనంగా నిర్వహించుకుంటామన్న సంగతి తెలసిందే…అయితే పక్కా ఇస్లామిక్ దేశమైన పాకిస్తాన్ వీధుల్లో కూడా దసరా సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. పాకిస్తాన్ పురవీధుల్లో హిందువులు గర్బా, దాండియా నృత్యాలతో హోరెత్తించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వేడుకలను చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

పాకిస్థాన్‌లో నివసిస్తున్న ప్రీతమ్ దేవ్రియా అనే హిందూ యువకుడు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఒక వీడియో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ వీడియోలో, విద్యుత్ దీపాలతో అలంకరించిన ఒక వీధిలో దుర్గామాత చిత్రపటాన్ని ఏర్పాటు చేసి పూజలు నిర్వహిస్తుండగా. యువతులు, పురుషులు సంప్రదాయ దుస్తులు ధరించి గర్బా, దాండియా ఆడుతూ పండుగను ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. ఇక ఇదే తరహాలో, కరాచీ నగరంలో జరిగిన వేడుకలకు సంబంధించిన మరో వీడియోను ధీరజ్ అనే వ్యక్తి పంచుకున్నాడు.. ఇక ఈ వేడుకలపై భారత్ నుంచి కూడా పలువురు “నవరాత్రి శుభాకాంక్షలు” తెలుపుతూ తమ తమ స్పందనను తెలియజేస్తున్నారు.