News

టెక్సాస్ లో షరియా చట్టంపై నిషేధం

158views

ఇస్లామిక్ షరియా చట్టం అమలుపై అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం నిషేధం విధించింది. ఎవరైనా ఈ చట్టాన్ని వ్యాపార సంస్థల్లోగానీ, వ్యక్తిగత విషయాల్లో గానీ అమలు చేసేందుకు ప్రయత్నిస్తే వెంటనే సమాచారమివ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

మద్యం, పందిమాంసం, లాటరీ టిక్కెట్లను విక్రయించరాదంటూ ఓ ముస్లిం బోధకుడు లౌడ్ స్పీకర్ ద్వారా దుకాణదారులను కోరుతున్నట్లుగా ఉన్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారిన నేపథ్యంలో అబాట్ నిషేధం విషయం ప్రకటించారు. ఇలా కోరడం వేధింపుల కిందికే వస్తుందని, మత నియమాలను ప్రజలపై బలవంతంగా రుద్దాలని చూస్తే సహించేదిలేదని స్పష్టం చేశారు.

‘టెక్సాస్ పరిధిలో షరియా చట్టాన్ని, షరియా ప్రాంగణాలను నిషేధించే చట్టంపై సంతకం చేశా. ఏ వాణిజ్య సంస్థ లేదా వ్యక్తి అటువంటి మూర్ఖులను చూసి భయపడరాదు’ అని అబాట్ ‘ఎక్స్’లో అన్నారు. ఎవరైనా షరియా చట్టాన్ని బలవంతంగా అమలు చేసేందుకు ప్రయత్నిస్తే టెక్సాస్ డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ సేఫ్టీకి తెలపండి అని ప్రజలను కోరారు. టెక్సాస్లో అధికారికంగా షరియాపై నిషేధం లేదు. అయితే 2017 నాటి అమెరికన్ లాస్ ఫర్ అమెరికన్ కోర్ట్స్ ప్రకారం టెక్సాస్లో అమెరికా చట్టంతో విభేదించే షరియా సహా ఏదైనా విదేశీ, మతపరమైన నిబంధనల అమలును నిరోధిస్తుంది.

షరియా వ్యక్తిగతమైనదే తప్ప, ప్రజా చట్టం కాదని పేర్కొన్నాయి. కొన్ని నెలల క్రితం ఈస్ట్ ప్లానో ఇస్లామిక్ సెంటర్ పేరుతో 400 ఎకరాల్లో ఏర్పాటు చేయతలపెట్టిన ప్రాజెక్టును సైతం అబాట్ తీవ్రంగా వ్యతిరేకించారు. నివాసాలు, స్కూళ్లు, మసీదు, వాణిజ్య సదుపా యాలతో ఏర్పాటయ్యే ఈ సముదాయం మరో షరియా జోన్ గా మారుతుందని ఆయన ఆరోపించారు.