News

దేవాలయాల ఆస్తులను రక్షించుకుందాం

302views

హిందూన్యాయవాదుల సమష్టి సంకల్పంతో రాష్ట్రంలో అన్యాక్రాంతమవుతున్న దేవాలయాల ఆస్తులు, మఠాలు, పీఠాలు, ఆశ్రమాలు, అన్న సత్రాలను రక్షించుకోవచ్చని పలువురు పీఠాధిపతులు, స్వామీజీలు పేర్కొన్నారు. విజయవాడ గొల్లపూడిలో హిందూ న్యాయవాదుల ధర్మ సమ్మేళనం జరిగింది.

శ్రీశైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ మాట్లాడుతూ హిందువులపై దాడుల నుంచి రక్షించుకునేందుకు న్యాయ, ధర్మ ప్రయత్నం చేయాలని పిలుపునిచ్చారు. ఆధ్యాత్మికవేత్త వేముల హజరత్తయ్యగుప్తా మాట్లాడుతూ ఫోరం ఫర్ హిందూ లాయర్స్ వ్యవస్థ ద్వారా ఆలయాల ఆస్తుల పరిరక్షణ కోసం చట్టాల సవరణకు ప్రయత్నం చేద్దామన్నారు.

అభయ్ హిందూ సేన వ్యవస్థాపకుడు రాధా మనోహర్ దాస్, చైతన్య తపోవనం నిర్వాహకులు మాతా శివచైతన్య, అష్టాక్షరి సంపత్ కుమార్ రామానుజ జీయర్ స్వామీజీ (అష్టాక్షరి పీఠం), భక్తి చైతన్యానంద సరస్వతి (శివానంద ఆశ్రమం ), రుద్ర యోగేశ్వరానంద (శైవ పీఠం), కృష్ణమా చార్య (బ్రహ్మపథం ఆశ్రమం), స్వరూపానంద (శ్రీలలితా పీఠం), శ్రీత్రిదండి భక్తి సుందర మం గళ్ మహరాజ్ (గౌడియ మఠం), భవానీ శంక రానంద (నవశక్తి పీఠాధిపతి), రాజేంద్ర ప్రసాద్ (గాలిగోపుర మఠం), హనుమత్ (త్రిశక్తి పీఠం) పాల్గొన్నారు. ఫోరం ఫర్ హిందూ లాయర్స్ లోగో, వెబ్సైట్ను ఆవిష్కరించారు.