News

మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ..

213views

ఆపరేషన్ కగార్‌లో భాగంగా మావోయిస్టులకు మరో ఊహించని షాక్ తగిలింది. ఈ మేరకు సీపీఐ మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యురాలు కల్పన అలియాస్ సుజాత అలియాస్ మైనక్కను పోలీసులుకు లొంగిపోయారు.

మోస్ట్‌ వాంటెడ్‌ మావోయిస్టు, పార్టీ కేంద్ర కమిటీ సభ్యురాలు పోతుల కల్పన ఎలియాస్‌ సుజాతక్క తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయారు. గద్వాల ప్రాంతానికి చెందిన ఆమె ప్రస్తుతం మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీలో ఉన్న ఏకైక మహిళా నాయకురాలు. పశ్చిమబెంగాల్‌లో 2011 జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన మావోయిస్టు పార్టీ అగ్రనేత కిషన్‌జీ భార్య ఆమె. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌ సౌత్‌ సబ్‌ జోనల్‌ బ్యూరో ఇన్‌ఛార్జిగా ఉన్నారు. 106 కేసుల్లో నిందితురాలిగా ఉన్న ఆమెపై రూ.కోటి రివార్డు ఉంది.

సుజాతక్క లొంగుబాటు వివరాలను డీజీపీ జితేందర్‌ వెల్లడించారు. ‘‘ఆమె స్వస్థలం గద్వాల జిల్లా గట్టు మండలం పెంచికలపాడు. ఆమె మొదట్లో ఆర్‌ఎస్‌యూ, జన నాట్యమండలిలో పని చేశారు. 1996లో కమాండర్‌గా విధులు నిర్వహించారు. 2001లో రాష్ట్ర కమిటీ సభ్యురాలిగా పనిచేశారు. అనారోగ్య కారణాలతో సుజాతక్క బయటికి వచ్చారు. ఆమెకు రూ.25 లక్షల రివార్డు అందిస్తాం. మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి రావాలని ఆహ్వానిస్తున్నాం. మావోయిస్టులు చాలా మంది లొంగిపోతున్నారు’’ అని జితేందర్‌ తెలిపారు.