News

నంది విగ్రహం అపహరణ

163views

అనంతపురం జిల్లా చెన్నేకొత్తపల్లి మండలంలోని ముష్టికోవెల సమీపంలో ఉన్న పురాతన శివాలయంలో నంది విగ్రహాన్ని దుండగులు అపహరించారు. ఉదయం పూజలు చేసేందుకు వెళ్లిన అర్చకుడు.. అక్కడ నంది విగ్రహం కనిపించకపోవడంతో వెంటనే స్థానికులను అప్రమత్తం చేశాడు. దీంతో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుని పరిశీలించారు. శివలింగానికి ఎదురుగా ప్రతిష్టించిన నందిని పెకలించి తీసుకెళ్లడంతో పాటు ఎవరికీ అనుమానం రాకుండా ఆలయం ప్రాంగణంలో ఉన్న మరో నంది విగ్రహాన్ని తీసుకెళ్లి అక్కడ ఉంచారు. గతంలోనూ ఈ ఆలయంలో కొందరు క్షుద్రపూజలు చేసి, చోరీకి ప్రయత్నం చేశారని, గుప్తనిధుల కోసమే నంది విగ్రహాన్ని ఎత్తుకెళ్లి ఉంటారనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఘటనపై గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.