
హిందువులు జరుపుకునే పండగలలో వినాయక చవితి పండగకు విశిష్ట స్థానం ఉంది. పిల్లలు ఎంతో ఇష్టంగా జరుపుకునే పండగ. పెద్దలు పిల్లలుగా మారే పండగ. దేశ వ్యాప్తంగా వినాయక చవితి సందడి మొదలైంది. వినాయక పుట్టిన రోజైన బాద్రపద మాసం శుక్ల పక్షం చవితి తిథి నుంచి పది రోజుల పాటు గణపతి పుజిస్తారు. ఇప్పటికే గల్లీ గల్లీలో గణపతి నవరాత్రి వేడుకల కోసం మండపాలను రెడీ చేస్తున్నారు. ఈ నేపధ్యంలో ఏపీ పోలీసులు గణపతి నవరాత్రి మండపాల ఏర్పాటు విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. మండపాల అనుమతి విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒకే విధానం ఉండలా ఒక ప్రత్యేక వెబ్ సైట్ ని తీసుకొచ్చారు.
వినాయక చవితి పండగ అంటే ఆబాలగోపాలం కోలాహాలంగా జరుపుకోవడానికి రెడీ అవుతారు. ఇప్పటికే ఈ పండగ సందడి మొదలైంది. గల్లీ గల్లీ లో గణపతి మండపాలు వెలుస్తాయి. చవితికి వారం రోజులున్నా బొజ్జ గణపయ్య భక్తుల హడావిడి మొదలైంది. అయితే బహిరంగ ప్రదేశాల్లో ఏర్పాటు చేసే గణపతి మండపాలకు పోలీసులు అనుమతి తీసుకోవాల్సి ఉంది. ఈ నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ మండపాల ఏర్పాటు విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. వినాయక చవితి మండపాల అనుమతులపై ఎటువంటి వివాదాలు లేకుండా.. ఎటువంటి సమస్యలు తలెత్తకుండా.. ఉండేలా ఏపీ పోలీసు శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. మండపాలకు అనుమతులు ఇచ్చే సమయంలో పొరపాట్లు జరగకుండా చూసేందుకు ఓ వెబ్‌సైట్‌ను క్రియేట్ చేసింది.
గణపతి నవరాత్రి ఉత్సవాల అనుమతుల కోసం ganeshutsav.net అనే వెబ్‌సైట్‌ను పోలీసులు తయారు చేశారు. ఈ వెబ్ సైట్ ద్వారా మండపాల నిర్వాహకులు సింగిల్ విండో విధానంలో ఆన్‌లైన్‌లో అప్లై చేసి అనుమతి తీసుకోవచ్చు. ఈ అనుమతుల కోసం ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు.
మండప నిర్వాహకులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న తర్వాత.. సంబంధిత పోలీస్ అధికారి ముందుగా మండపం ఏర్పాటు చేసే స్థలాన్ని పరిశీలిస్తారు. అక్కడ నిబంధనల ప్రకారం ఉన్నట్లు గుర్తిస్తే.. వెంటనే QR కోడ్‌తో కూడిన నిరభ్యంతర పత్రాన్ని (NOC) జారీ చేస్తారు. ఈ విధానం వలన ఉత్సవాలను సురక్షితంగా నిర్వహించేలా చూడవచ్చు అని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
మండపాల కోసం ఆన్‌లైన్‌లో ఎలా అప్లై చేయాలంటే
అప్లికేషన్ నింపడానికి కావాల్సిన వివరాలు ఏమిటంటే..
ఈ వివరాలను పూర్తీ చేసి సబ్మిట్ చేస్తే.. ఆ వివరాల ఆధారంగా సమీపంలోని పోలీస్ అధికారి ఆ ప్రాంతానికి తనిఖీని వస్తారు. ఫారంలో ఇచ్చిన వివరాలు సరిగ్గా ఉన్నాయని భావిస్తే.. మీరు ఇచ్చిన ఫోన్ నెంబర్ కి అనుమతి పత్రాన్ని పంపిస్తారు. సో ఈ ఏడాది మండప ఏర్పాటు కోసం అనుమతి కోసం పోలీస్ స్టేషన్ చుట్టూ,, పోలీసుల చుట్టూ భక్తులు తిరగాల్సిన పని లేదు.




