News

100 రోజులు, 100 దేశాలు ఒకే కుటుంబంగా ప్రపంచ సాంస్కృతిక మహోత్సవం.

147views

ఒకే ప్రపంచం – ఒకే కుటుంబం” మిషన్ వ్యవస్థాపకులు సద్గురు శ్రీ మధుసూదన సాయి, ప్రధానోపన్యాసం అందిస్తూ, సంస్కృతిని ‘‘అనుసంధానం, ఆరాటం, సహకారం, సహజీవనం, సహసృష్టి’’గా అభివర్ణించారు. శతాబ్దానికి ఒకసారి వచ్చే ఏకత్వం, ప్రేమ, శాంతిని అనుభవించేందుకు ఈ వేడుకల్లో పాల్గొనాలని ప్రపంచాన్ని ఆహ్వానించారు.

ప్రపంచ సాంస్కృతిక మహోత్సవం 2025 కర్ణాటకలోని సత్య సాయి గ్రామంలో అద్భుతంగా ప్రారంభమైంది. భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, ఇందిరా గాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ది ఆర్ట్స్ -IGNCA సహకారంతో ఒకే ప్రపంచం – ఒకే కుటుంబం మిషన్ ఈ మహోత్సవానికి శ్రీకారం చుట్టింది. ఈ మహోత్సవం 100 రోజులపాటు కొనసాగి, 100 దేశాలను ఏకం చేస్తూ, సంస్కృతి, ఆధ్యాత్మికత, సేవ, మానవత్వాన్ని ఒకే వేదికపై తీసుకురావడం ముఖ్య ఉద్ధేశం. సనాతన సంప్రదాయాల నుండి ఆధునిక కళారూపాల వరకు, ఆధ్యాత్మిక చర్చల నుండి కళా ప్రదర్శనల వరకు – ఈ మహోత్సవం ఒకే సత్యాన్ని పునరుద్ఘాటిస్తుంది. “సరిహద్దులు, విభజనలు ఉన్నప్పటికీ, ప్రపంచంలోని మానవజాతి మొత్తం ఒకే కుటుంబంగా నిలబడగలదన్నది ఈ వేడుక ఉద్ధేశం.”

భారత ప్రభుత్వం తరఫున సాంస్కృతిక మంత్రి, గౌరవనీయ శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్, ఈ మహోత్సవంలో పాల్గొనే అన్ని దేశాలకు హృదయపూర్వక స్వాగతం పలికారు. అలాగే, భారత సాంస్కృతిక సంపదను ప్రతిబింబించే ప్రత్యేక సాంస్కృతిక ప్రదర్శనను IGNCA ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. పద్మభూషణ్, మిషన్ కర్మయోగి భారత్ చైర్‌పర్సన్, కళాక్షేత్ర ఫౌండేషన్ మాజీ చైర్మన్ శ్రీ సుబ్రమణియన్ రామదొరై, ‘‘శ్రద్ధ, భాగస్వామ్యం, దాతృత్వం, సద్భావన, అవగాహన, సహకారం’’ అని ఈ ఉత్సవం సందేశమని వ్యాఖ్యానించారు.