News

పౌరసత్వ సవరణ చట్టంపై నిరసనలు మాత్రమేనా? హర్షాతిరేకాలు కూడా….

747views

పౌరసత్వ సవరణ చట్టం ద్వారా భారత పౌరసత్వం పొందిన పాకిస్థాన్ మహిళ

పౌరసత్వ సవరణ చట్టంపై దేశ వ్యాప్తంగా నిరసనలు చోటు చేసుకుంటున్న తరుణంలో ఓ పాకిస్థానీ మహిళకు భారత పౌరసత్వం లభించింది. గుజరాత్ రాష్ట్రం భాన్వాడ్ తాలూకాలో పుట్టి పెరిగిన హసనా బెన్ అనే మహిళ 1999లో వివాహం అనంతరం పాకిస్థాన్‌కు వెళ్లింది.

ఈ క్రమంలో ఆమె పాకిస్థాన్ పౌరసత్వం స్వీకరించింది. తన భర్త మరణించడంతో భారతదేశానికి తిరిగిరావాలని హసీనా నిర్ణయించుకుంది. రెండు సంవత్సరాల క్రితం భారత పౌరసత్వం కోరుతూ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంది. ఆమె అభ్యర్థనను పరిగణలోకి తీసుకున్న భారత ప్రభుత్వం డిసెంబర్ 18న పౌరసత్వం మంజూరు చేసింది. ద్వారకా జిల్లా కలెక్టర్ డా నరేంద్ర కుమార్ మీనా హసీనాకు భారత పౌరసత్వ ధృవీకరణ పత్రాన్ని అందజేశారు.

కాగా, ఇటీవల పార్లమెంటు ఆమోదం తెలిపిన పౌరసత్వ సవరణ బిల్లుకు రాష్ట్రపతి కూడా ఆమోద ముద్ర వేయడంతో చట్టంగా మారిన విషయం తెలిసిందే. కాగా, నాటి నుంచి దేశ వ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు చోటు చేసుకుంటున్నాయి. పశ్చిమబెంగాల్, అస్సాం, ఈశాన్య రాష్ట్రాలతోపాటు దేశ రాజధానిలోనూ నిరసనలు ఉద్రిక్తతకు దారితీస్తున్నాయి. ఆందోళనకారులు ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తుండటంతో పోలీసులు లాఠీ ఛార్జీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఉత్తరప్రదేశ్, కర్ణాటకతోపాటు పలు యూనివర్సిటీల్లోని విద్యార్థులు కూడా పౌరసత్వ సవరణకు వ్యతిరకంగా ఆందోళనలకు దిగుతున్నారు.

పౌరసత్వ సవరణ చట్టంతో భారతీయులకు ఎలాంటి నష్టం లేదని ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ చట్టం కేవలంలో పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ దేశాలలో హింసకు గురై మనదేశంలోకి శరణార్థులుగా వచ్చిన మైనార్టీలకు పౌరసత్వం కల్పించేది మాత్రమే.

నిరసనలు మాత్రమేనా? హర్షాతిరేకాలు కూడా….

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశంలో కొన్ని చోట్ల ఓ వైపు ఆందోళనలు జరుగుతుండగా మరోవైపు కొన్ని చోట్ల హర్షాతిరేకాలు కూడా వ్యక్తమౌతున్నాయి. ఈ చట్టాన్ని స్వాగతించిన పాకిస్థాన్‌కు చెందిన హిందువులు నేడు రాజ్‌ఘాట్‌ వద్ద ర్యాలీ చేపట్టారు. మోడీ…. మోడీ…. అని నినాదాలు చేస్తూ తమ ఆనందాన్ని తెలియజేశారు.

ఇందుకు సంబంధించిన వీడియోను మయాంక్‌ అనే నెటిజన్‌ ట్విటర్‌లో పోస్టు చేయగా దాన్ని పద్మశ్రీ గ్రహీత మోహన్‌దాస్‌ రీట్వీట్‌ చేశారు. ఢిల్లీ మాత్రమే కాదు దేశవ్యాప్తంగా పలు చోట్ల పౌరసత్వ సవరణ చట్టానికి అనుకూలంగా ర్యాలీలు చేస్తున్నారు.

మరిన్ని జాతీయఅంతర్జాతీయ వార్తలువిశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.