
267views
ప్రజలందరూ మట్టి వినాయకుడిని పూజించి పర్యావరణాన్ని రక్షించడంలో భాగస్వాములు కావాలని నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా పేర్కొన్నారు. కలెక్టరేట్ లోని తమ ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ రాజకుమారి కాలుష్య నియంత్రణ మండలి వారి ఆధ్వర్యంలో మట్టి వినాయకుడిని పూజిద్దాం పర్యావరణాన్ని రక్షిద్దాం అనే నినాదంతో కూడిన పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఈ నెల 27వ తేదీ జరిగే వినాయక చవితి పండుగను ప్రజలందరూ సుఖసంతోషాలతో జరుపుకోవాలన్నారు. పర్యావరణానికి హాని కలవకుండా రసాయనాలతో చేసిన విగ్రహాలకు బదులుగా మట్టి విగ్రహాలను పూజించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ కిషోర్ రెడ్డి, ఏఈఈ రామకృష్ణ, వారి సిబ్బంది పాల్గొన్నారు.





