News

భారతీయ జీవన విధానంపై రష్యన్ మహిళ ప్రశంసలు

33views

మోహాలిలో నివసిస్తున్న సోఫియా అనే రష్యన్ మహిళ, భారతీయ మహిళల నుంచి తాను అలవర్చుకున్న ఐదు మంచి అలవాట్లను వివరిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. భారతీయ జీవనశైలి తనను ఎంతగా మార్చిందో ఆమె ఈ వీడియోలో వివరించారు. “భారతీయ మహిళల నుంచి నేను సూక్ష్మంగా స్వీకరించిన అలవాట్లు” అనే క్యాప్షన్‌తో పోస్ట్ చేసిన ఈ వీడియోకు 3 లక్షలకు పైగా వీక్షణలు వచ్చాయి.

ఆమె పంచుకున్న ఐదు అలవాట్లు ఇవే:

1.ఉదయాన్నే నిద్రలేవడం: రష్యాలో ఉదయం 10 గంటలకు నిద్రలేచే తాను, ఇండియాలో ఇప్పుడు 5 నుంచి 7 గంటల మధ్యే మేల్కొంటున్నానని తెలిపారు.

2.వంటతో రోజు ప్రారంభం: భర్త నిద్రలేచేసరికి వేడివేడి భోజనం సిద్ధం చేసేందుకు, ఉదయాన్నే వంట చేస్తున్నట్లు చెప్పారు.

3.భర్తతో సంప్రదింపులు: ఏ నిర్ణయం తీసుకునే ముందైనా భర్తను సంప్రదించడం రష్యాలో స్వేచ్ఛ లేకపోవడంగా భావించినా, ఇక్కడ అది ఒక టీమ్‌వర్క్‌లా అనిపిస్తోందని ఆమె పేర్కొన్నారు.

4.సంప్రదాయ దుస్తులు: చీరలు, సూట్లు ధరించడం వల్ల ప్రతి కార్యక్రమం ప్రత్యేకంగా అనిపిస్తుందని, అందంగా ఉన్నామనే అనుభూతి కలుగుతుందని అన్నారు.

5.అతిథి మర్యాదలు: ఇంటికి వచ్చిన అతిథులకు వెంటనే నీళ్లు, టీ లేదా కాఫీ అందించడం అలవాటు చేసుకున్నట్లు తెలిపారు.

ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆమెను ప్రశంసిస్తున్నారు. “అమెరికాలో వ్యక్తి స్వాతంత్ర్యానికి ప్రాధాన్యం ఇస్తే, ఇండియాలో కుటుంబానికే పెద్దపీట వేస్తారు” అని ఒకరు వ్యాఖ్యానించారు. మొత్తంమీద, ఈ రష్యన్ మహిళ భారతీయ జీవన విధానం, కుటుంబ విలువలను ఎంతగానో గౌరవిస్తూ వాటిని అనుసరిస్తున్న తీరు అందరినీ ఆకట్టుకుంటోంది.