
209views
ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసిలో గంగా నది ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తోంది. ఫలితంగా స్నాన ఘాట్లు మునిగిపోయాయి. సమీపంలోని ప్రాంతాల్లోకి వరద నీరు చేరింది. ఆలయాలు, దుకాణాల్లో మోకాళ్ల లోతు నీరు నిలిచింది. స్నాన ఘాట్ల వెంబడి అధికారులు రెస్య్కూ సిబ్బందిని మోహరించారు. భక్తులను ఘాట్లలోకి అనుమతించడం లేదు. వరదల కారణంగా భక్తుల సంఖ్య భారీగా పడిపోయిందని స్థానికులు తెలిపారు. ఎగువున భారీ వర్షాలు కురుస్తుండటంతో గంగా నది గత నాలుగైదు రోజులుగా ఉప్పొంగి ప్రవహిస్తోందని అధికారులు తెలిపారు. మరికొన్ని రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందన్నారు.





