News

బాలికను అపహరించిన షేక్‌ రియాజ్‌కేసు నమోదు

211views

ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం పెంచుకొని మాయమాటలతో బాలికకు అపహరించిన యువకుడిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. వత్సవాయి ఇన్‌ఛార్జి ఎస్‌ఐ అర్జున్‌ తెలిపిన వివరాల మేరకు.. గుంటూరు జిల్లా ప్రత్తిపాడుకు చెందిన షేక్‌ రియాజ్‌(26) అవివాహితుడు కాగా.. వత్సవాయి మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికతో గత కొంతకాలంగా ఇన్‌స్టాగామ్‌లో చాటింగ్‌ చేస్తున్నాడు. ఈ క్రమంలో ఆమెకు మాయమాటలు చెప్పిన ఈనెల 3వ తేదీ రాత్రి బాలిక గ్రామానికి వచ్చి ప్రత్తిపాడు తీసుకెళ్లాడు. అనంతరం బాలిక ఇంట్లో కనిపించపోవడంతో అదేరోజు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా అదృశ్యం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

పట్టించిన ‘కాల్‌మీ’ సంక్షిప్త సందేశం .. బాలిక ఫోన్‌ తీసుకెళ్లినా స్విచ్‌ ఆఫ్‌లో ఉంచడంతో ఎక్కడుందో తెలియలేదు. తల్లిందండ్రులు వాడే ఫోన్ ని పోలీసులు పరిశీలించగా అందులో నుంచి ఒకసారి ఒక నంబరుకు ‘కాల్‌మీ’ అని మెసేజ్‌ చేసిన నంబరు అధారంగా పోలీసులు విచారణ చేసి యువకుని చిరునామా గుర్తించారు. చరవాణి సిగ్నల్స్‌ ఆధారంగా పోలీసులు ప్రత్తిపాడు వెళ్లి ఇద్దర్నీ అదుపులోకి తీసుకున్నారు. బాలికను ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు. రియాజ్‌ను రిమాండ్‌కు పంపినట్లు ఎస్‌ఐ తెలిపారు.