
సీఐఎస్ఎఫ్ (సెంట్రల్ ఇండస్ట్రీయల్ సెక్యూరిటీ ఫోర్స్) సిబ్బంది సంఖ్యను మరో 20 వేల మేర పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం 2 లక్షలుగా ఉన్న సిబ్బంది సంఖ్యను 2.20 లక్షలకు పెంచనున్నట్లు హోంశాఖ ఇటీవల ఓ ప్రకటనలో తెలిపింది. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో 2026 మార్చి తర్వాత రాబోయే పరిశ్రమలకు, విమానాశ్రయాలు, పోర్టులు వంటి కీలక రంగాలకు భద్రత పెంచే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది. ప్రైవేటు సంస్థల్లో, సులువైన విధులు ఉండే చోట పనిచేస్తున్న సిబ్బందిని క్రమం తప్పకుండా వేరే ప్రాంతాలకు బదిలీ చేయాలని కూడా హోంశాఖ ఆదేశించింది. దీనివల్ల సంస్థలో వృత్తి నైపుణ్యం, పనిలో చురుకుదనం పెరుగుతాయని అధికా రులు అంటున్నారు. కాగా, 2026 మార్చి నాటికి నక్సలిజాన్ని అంతంచేస్తా మని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఖనిజ వనరులు అధికంగా లభించే ఛత్తీస్ గఢ్ వంటి రాష్ట్రాల్లో మావోయిస్టులను అంతం చేసి అక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేయాలని కేంద్రం యోచిస్తున్నట్లు సమాచారం.




