News

అలిపిరి ఆర్చిపై అన్యమత బొమ్మల కలకలం

168views

తిరుమల తిరుపతి దేవస్థానంలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమలలోని కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు తరలి వస్తారనే విషయం తెలిసిందే. అయితే.. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి కొలువైన తిరుపతిలో అపచారం చోటుచేసుకుంది. భక్తులు శ్రీవారిని దర్శించుకోవడానికి అలిపిరి వద్ద మెట్ల మార్గం, కాలి నడక మార్గం, ఘాట్ రోడ్డు మార్గాల గుండా వెళతారు. ఈ క్రమంలో తిరుమలకు వెళ్లే దారిలో ఉన్న అలిపిరి మార్గంలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది.

తిరుపతిలో అలిపిరి ఆర్చిపై అన్యమత బొమ్మలు దర్శనమిచ్చాయి. అలిపిరి ఆర్చి పై అన్యమత బొమ్మలు ఉండటం తీవ్ర కలకలం సృష్టిస్తోంది. అలిపిరి మార్గం గుండా వచ్చే భక్తులు నిన్న(శుక్రవారం) వీటిని గుర్తించారు. దీంతో భక్తుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వీటిని ఎవరు? ఎప్పుడు? ఎలా అమర్చారనే విషయాలను టీటీడీ పాలకమండలి, ఉన్నతాధికారులు తేల్చాలని శ్రీవారి భక్తులు డిమాండ్ చేస్తున్నారు. ఈ తరహా బొమ్మలు గతంలో ఎవరి కోసం ఏర్పాటు చేశారు. ఇందుకు ఎవరు అనుమతి ఇచ్చారనే అంశం పై ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఈ విషయం పై తిరుమల తిరుపతి దేవస్థానం -TTD అధికారులు విచారణ జరుపుతున్నట్లు సమాచారం.