News

రాహుల్ గాంధీపై వీర సావర్కార్ మనవడు ఆగ్రహం

546views

కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన ‘భారత్ బచావో’ ర్యాలీలో పాల్గొన్న రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. చెప్పిన నిజాలపై తాను ఎన్నడూ క్షమాపణలు కోరననీ.. నా పేరు రాహుల్ సావర్కర్ కాదు.. నా పేరు రాహుల్ గాంధీ అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

రాహుల్ తన ప్రసంగంలో వీర సావర్కర్ పేరును వాడడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. రాహుల్ వ్యాఖ్యలు సావార్కర్ని అవమానపరిచే రీతిలో ఉన్నాయని పలువురు నేతలు అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యలపై  వీర సావర్కర్ మనవడు రంజిత్ సావర్కర్ ముంబైలో నిరసన ర్యాలీ చేపట్టడమే కాకుండా రాహుల్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. స్వాతంత్ర సమర యోథులను గౌరవించడం రాహుల్ నేర్చుకోవాలని, ఈ వ్యాఖ్యలపై తాను పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రిని కలుస్తామని, రాహుల్ చేసిన వ్యాఖ్యలను ఖండించాలని కోరతామని చెప్పారు.

మరిన్ని జాతీయఅంతర్జాతీయ వార్తలువిశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.