News

గండికోటకు యునెస్కో గుర్తింపు దిశగా అడుగులు

266views

ప్రముఖ పర్యాటక కేంద్రమైన గండికోటను ప్రపంచ వారసత్వ కట్టడంగా తాత్కాలిక జాబితాలో చోటు కల్పించేందుకు నివేదికను కేంద్రానికి పంపాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ అయ్యాయి. వైయస్సార్ కడప జిల్లా గండికోట లోయకు ప్రపంచ స్థాయిలో యునెస్కో గుర్తింపు ఆమోదం కోసం ఇప్పటికే ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ క్రమంలో కేంద్ర జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా ఉన్నతాధికారులు ఈ ఏడాది ఏప్రిల్‌ 10న ఈ ప్రాంతాన్ని సందర్శించారు. ఇక్కడి వనరులు, భౌగోళిక స్థితిగతులు, సాంస్కృతిక పరిస్థితులను పరిశీలించారు. కేంద్ర గనుల మంత్రిత్వశాఖ కార్యదర్శి వి.ఎల్‌.కాంతారావు నేతృత్వంలో బృందం సభ్యులు కోట పరిసరాలను అప్పట్లో క్షుణ్నంగా పరిశీలించారు. యునెస్కో ఆమోదానికి అవసరమైన అర్హతలు, ప్రామాణికాలు, అర్హతలపై చర్చించారు. తాజాగా నివేదికలు పంపాలని కోరారు. ఈ మేరకు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్‌ స్పందించారు. గండికోట గురించి తయారు చేసిన నివేదికను వెంటనే పంపాలని పర్యాటక శాఖ అధికారులను సూచించినట్లు తెలిసింది.