News

సమరసతా సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో కనకదుర్గమ్మకు ఆషాఢ సారె

322views

సమరసతా సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆషాఢ మాసం సందర్భంగా గ్రామ దేవతలకు సారె సమర్పించారు.ఇందులో భాగంగా మేళతాళాలు, మంగళ వాయిద్యాల మధ్య ఊరేగింపుగా వెళ్లి స్థానిక గ్రామ దేవతలకు సారె అందజేశారు. అలాగే అవనిగడ్డ సబ్ డివిజన్ నుంచి కోడూరు, నాగాయ లంక, అవనిగడ్డ మండలాల్లోని 12 గ్రామాల నుంచి మొత్తం 240 మంది భక్తులు విజయవాడ కనకదుర్గమ్మకు సమర్పించేందుకు సారె తీసుకెళ్లారు. ఆయా ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లా ధర్మపరిషత్ నేతలు జయశంకర్, నగరాజ కుమారి, రామన్న, నాంచారమ్మ పాల్గొన్నారు.

గుడివాడ, అవనిగడ్డ, ప్రామర్రు నియోజకవర్గాల్లో మహిళలు శనివారం అమ్మ వారికి ఆషాఢ సారె సమర్పించారు. . అవనిగడ్డ, కోడూరు, నాగాయలంక ప్రాంతాలకు చెందిన భక్తులు సమర సత్వసేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో విజయవాడ ఇంద్రకీలాద్రిలో కొలువై ఉన్న కనకదుర్గాదేవికి సారె సమర్పించారు.