
213views
భారత్‌కు మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది, జైష్-ఎ-మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ పాక్ ఆక్రమిత కశ్మీర్-పీవోకేలో తలదాచుకుంటున్నట్లు భారత నిఘా వర్గాలు గుర్తించాయి. భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ను చేపట్టిన చేపట్టిన సమయంలో మసూద్ బహావల్‌పూర్‌లో ఉండగా.. క్షిపణి దాడుల్లో అతని కుటుంబ సభ్యులు చనిపోయిన విషయం తెలిసిందే..! ఆ తర్వాత అతని జాడ తెలియలేదు. అయితే.. తాజాగా బహావల్‌పూర్ నుంచి సుమారు వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఉండే గిల్గిట్-బాల్టిస్థాన్ ప్రాంతంలో మసూద్ కనిపించినట్లు భారత నిఘావర్గాలు గుర్తించాయి. గిల్గిట్-బాల్టిస్థాన్‌లోని స్కార్డ్ నగరంలోని సద్‌పారా రోడ్డులో మసూద్ కనిపించినట్లు సమాచారం.





