
203views
గోటి తలంబ్రాల ధాన్యానికి భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేశారు. తూర్పుగోదావరి జిల్లా శ్రీకృష్ణ చైతన్య సంఘం నిర్వాహకులు కల్యాణ అప్పారావు ఆధ్వర్యంలో కొన్నేళ్ల నుంచి ఏటా గోటి తలంబ్రాలను శ్రీరామనవమికి భద్రాచలంలో అందిస్తున్నారు. ఈనేపథ్యంలో ధాన్యాన్ని రాముల వారి పాదాల వద్ద నుంచి పూజించారు. ఈ ధాన్యాన్ని తూర్పుగోదావరి జిల్లాలోని తమ గ్రామంలో నారుగా పోసి దాని నుంచి వచ్చే ధాన్యాన్ని సేకరించి ఆ వడ్లను గోటితో వలిచి బియ్యంగా చేస్తారు. ఈ తలంబ్రాల బియ్యాన్ని 2026 శ్రీరామనవమికి భద్రాచలంలో అందించనున్నారు.





