NewsSeva

విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం

502views

నంద్యాల జిల్లా, విశ్వహిందూ పరిషత్, సేవా విభాగం ప్రణవ్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్ డాక్టర్ డి రామసుబ్బారెడ్డి యం. యస్ గారి సహకారంతో విశ్వహిందూ పరిషత్ కార్యాలయం భగీరత్ భవన్ లో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి 170 మంది రిజిష్టర్ చేసుకోగా, 140 మంది ఓపీకి హాజరై పరీక్షలు చేయించుకున్నారు.5 గురికి డయాబెటిక్ రెటినోపతి నిర్దారణ అయిందని వైద్యులు తెలిపారు. 25 మందికి ఆపరేషన్ చేయవలసి ఉందని వైద్యులు నిర్ధారించారు. అనంతరం వారికి అవసరమైన వారికి మందులు, చుక్కల మందులు అందజేశారు.

వైద్యుల సహకారంతో ఇలాంటి వైద్య సేవలు నిరంతరం అందజే‌స్తామని నిర్వాహకులు తెలియజేశారు.

జిల్లా అధ్యక్షులు బుగ్గన చంద్రమౌళీశ్వరరెడ్డి గారి అధ్యక్షతన, అతిథులు శ్రీ గోర్ల సుదర్శన్, ప్రాంత కార్యకారిణి సభ్యులు శ్రీ యర్రం శంకర్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన, మాలార్పణ తరువాత ప్రారంభమైన కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి శ్రీ కిషోర్, జిల్లా ఉపాధ్యక్షులు శ్రీ శేష సాయి, జిల్లా సేవా ప్రముఖ్ శ్రీ మోహన్ కిరణ్, కార్యాలయ ప్రముఖ్ శ్రీ లింగేశ్వర రావు, బజరంగదళ్ జిల్లా సహా సంయోజక్ శ్రీ వరప్రసాద్, నంద్యాల నగర అధ్యక్షులు, జగజ్జనని ప్రఖండ అధ్యక్షులు శ్రీ వెంకటసుబ్బయ్య, ప్రధమనంది ప్రఖండ అధ్యక్షులు శ్రీ చంద్రశేఖర్, శ్రీ రామ నర్సింహ, సిరివెళ్ల ప్రఖండ సహ కార్యదర్శి శ్రీ కే బాలరాజు శ్రీ సుబ్రహ్మణ్యం, శ్రీ నాగ మునీశ్వర్ రెడ్డి, 36 సార్లు రక్తం దానం చేసిన ప్రముఖ సామాజిక కార్యకర్త శ్రీ శీలం శ్రీకాంత్, ల్యాబ్ టెక్నీషియన్ శ్రీ ఆకుల శ్రీనివాసులు, శ్రీ శివ, శ్రీ సుబ్బరామయ్య, శ్రీ రామకృష్ణ, శ్రీ సురేష్ తదితరులు పాల్గొన్నారు.