
మరాఠా పాలకులు నిర్మించిన అసాధారణ కోట, సైనిక వ్యవస్థను సూచించే పలు కోటలను ‘మరాఠా మిలిటరీ లాండ్‌స్కేప్స్’ పేరుతో ప్రఖ్యాత యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో తాజాగా చేర్చారు. పారిస్‌లో జరుగుతున్న ప్రపంచ వారసత్వ కమిటీ (డబ్ల్యూహెచ్‌సీ) 47వ సదస్సులో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు యునెస్కో ‘ఎక్స్’ వేదికగా వెల్లడించింది. మహారాష్ట్రలోని సాల్హేర్ కోట, శివ్‌నేరీ కోట, లోహ్‌గఢ్, ఖండేరీ కోట, రాయగఢ్, రాజ్‌గఢ్, ప్రతాప్‌గఢ్, సువర్ణదుర్గ్, పన్హాలా కోట, విజయ్‌దుర్గ్, సింద్‌దుర్గ్, తమిళనాడులోని జింజీ కోట ఈ ‘మరాఠా మిలిటరీ లాండ్‌స్కేప్స్’లో భాగంగా ఉన్నాయి. ఈ 12 కోటల సమాహారంలో సల్హేర్ కోట, శివనేరి కోట, లోహ్‌గఢ్, ఖండేరి కోట రాజీగఢ్, రాజ్‌గఢ్, ప్రతాప్‌గఢ్, సువర్ణదుర్గ్, పన్హాలా కోట, విజయ్ దుర్గ్, సింధుదుర్గ్‌లు మహారాష్ట్రలో ఉండగా జింజీ కోట తమిళనాడులో ఉంది. కాగా, మరాఠీ మిలిటరీ ల్యాండ్‌స్కేప్‌లు 17-19 శతాబ్దాల మధ్య నిర్మించారు. విభిన్న భౌగోళిక, భౌతిక ప్రాంతాల్లో విస్తరించి ఉన్న ఈ భాగాలు మరాఠా పాలన వ్యూహాత్మక శక్తులను ప్రతిబింబిస్తాయని భారతీయ అధికారులు పేర్కొన్నారు.





