News

సార్వత్రిక సమ్మెకు మేం దూరం – బీఎంఎస్‌

150views

కొన్ని కార్మిక సంఘాలు తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో తాము పాల్గొనడం లేదని భారతీయ మజ్దూర్‌సంఘ్‌ (బీఎంఎస్‌) ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సమ్మెకు తాము దూరంగా ఉంటున్నామని, తమ అనుబంధ సంఘాలేవీ ఈ సమ్మెలో పాల్గొనడంలేదని సంఘ ప్రతినిధులు ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్రం తీసుకొచ్చిన కోడ్‌ ఆన్‌ వేజెస్‌ -19, కోడ్‌ ఆన్‌ సోషల్‌ సెక్యూరిటీస్‌లను తాము స్వాగతించామని, కావున నాలుగు లేబర్‌కోడ్‌లను వ్యతిరేకిస్తూ తలపెట్టిన సమ్మెలో తాము భాగస్వామ్యం కావడంలేదన్నారు. బీఎంఎస్‌ అనుబంధ కార్మిక సంఘాలేవీ సమ్మెలో పాల్గొనవద్దని వారు పిలుపునిచ్చారు.