
విశ్వహిందూ పరిషత్ – బజరంగ్ దళ్ కృష్ణాజిల్లా విభాగం – మచిలీపట్నం ఆధ్వర్యంలో ఈ నెల 28,29 తేదీలలో విశ్వహిందూ పరిషత్ కృష్ణా జిల్లా ప్రశిక్షణ వర్గను నిర్వహించారు. మచిలీపట్నం గొడుగు పేటలో గల శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి కళ్యాణ మండపం నందు నిర్వహించిన సమావేశంలో అన్ని ఆయాముల జిల్లా, ప్రఖండ, ఖండ స్థాయి మరియు ఇతర బాధ్యతలు కలిగిన వారు వర్గకు హాజరైయ్యారు.

ఈ సందర్బంగా వివిధ అయముల, కార్యకర్తల బాధ్యత, వార్షిక ప్రణాళిక ప్రకారం రాబోవు వార్షిక యోజన ప్రకారం రాబోవు రోజుల్లో కార్యకర్తలు నిర్వహించవలసిన కార్యక్రమాలు గురించి దిశా నిర్దేశం చేశారు. అలాగే మచిలీపట్నం నందు 5 చోట్ల బాలంసంస్కర కేంద్రాలు స్థాపించి నిర్వహించదలచారు. దానికి ఆచార్యులను నియమించడం, మాతృశక్తి కార్యక్రమాల్లో భాగంగా ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రాలలో స్థానికుల భాగస్వామ్యంతో సత్సంగ నిర్వహణ చేయాలని నిర్వహించారు.

దుర్గా వాహిని – భజరంగ్ దళ్ ఆద్వర్యంలో నూతన సభ్యులను నియుక్తి చేసి, హిందూ సమాజాన్ని బలోపేతం చేస్తూ, ఐక్యతతో వారితో వర్గల నిర్వహణ చేసి పూర్తిస్థాయిలో కార్యక్రమాలు నిర్వహించేలా చూడాలని నిర్ణయించారు.
సామాజిక సమరసత సభ్యుల చేత విశిష్ట వ్యక్తుల సమ్మ్యమనం చేసి హిందూ కార్యక్రమాలు చెయ్యాలని , రాష్ట్రంలో గో రక్ష చట్టం అమలు జరిగేలా, హిందువులలో అవగాహన కలిగేలా చూడడం, దేవాలయాలు వాటి ఆస్తులు పరిరక్షణ యొక్క అవశ్యకత తెలియజేశారు.





