
210views
అయోధ్య పుణ్యక్షేత్రంలో రామకథా మ్యూజియం నిర్మాణం శరవేగంగా సాగుతున్నట్లు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర నిర్మాణ కమిటీ ఛైర్మన్ నృపేంద్ర మిశ్ర తెలిపారు. వీలైనంత త్వరగా ఈ పనులు పూర్తి చేస్తామన్నారు. మ్యూజియంలో దాదాపు 20 గ్యాలరీలు ఉంటాయని ప్రకటించారు. ‘‘గత 500 ఏళ్ల చరిత్రను తెలుపుతూ గ్రౌండ్ ఫ్లోరులో రెండు గ్యాలరీలు ఏర్పాటు చేస్తాం. తవ్వకాల సమయంలో వెలికితీసిన కొన్ని చారిత్రక వాస్తవాలను ధ్రువీకరించే కళాఖండాలను ప్రదర్శిస్తాం. వివిధ దేశాల్లో రాముడిని ఎలా పూజిస్తారో వివరించే అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన గ్యాలరీలు బేస్‌మెంట్లో ఉంటాయి. ఐఐటీ చెన్నై అభివృద్ధి చేస్తున్న ప్రత్యేక హనుమాన్ గ్యాలరీ నవంబరు లేదా డిసెంబరు నాటికి పూర్తవుతుంది. మ్యూజియంలోని కొన్ని భాగాలను ఈ ఏడాది చివరినాటికి భక్తుల సందర్శనకు అందుబాటులోకి తెస్తాం’’ అని నృపేంద్ర మిశ్ర తెలిపారు.





