News

వైభవంగా జగన్నాథుని రథయాత్ర

328views

హరేకృష్ణ గోకులక్షేత్రం ఆధ్వర్యంలో శనివారం ఏలూరు నగరంలో జగన్నాథస్వామి రఽథయాత్ర వైభవంగా నిర్వహించారు. ఏలూరు రామచంద్రరావుపేటలోని వేంకటేశ్వరస్వామి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ జగన్నాథ రథయాత్ర నగరంలో నిర్వహించడం వల్ల ఇక్కడ ప్రజలకు అంతే శుభమే జరుగుతుందన్నారు. రథయాత్రలో ఎమ్మెల్యే చంటి దంపతులు పూజలు చేసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగరానికి చెందిన కళాభూమి కూచిపూడి కళాకారులు వై.సతీష్‌కుమార్‌, నాగలక్ష్మి శిష్యబృందం నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. రథం వద్ద వంశీధర్‌ స్వామిజీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళా ప్రతినిధులు కోలాటం ప్రదర్శనలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు రథయాత్రలో పాల్గొనడం విశేషం. హరేకృష్ణ గోకులక్షేత్రం నిర్వాహకులు వంశీధర్‌ స్వామిజీ, సిబ్బంది పాల్గొన్నారు. వెంకటేశ్వరస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో భక్తులు దాదాపు రెండు వేల అన్నప్రసాద వితరణ చేపట్టారు. కార్యక్రమంలో ఉషాబాల సంస్థల అధినేత వీవీ బాలకృష్ణారావు, ఏలూరు ఇడా చైర్మన్‌ పెద్దిబోయిన శివప్రసాద్‌, కార్పొరేషన్‌ కో–ఆప్షన్‌ సభ్యుడు ఎస్‌ఎంఆర్‌ పెదబాబు, ఆర్‌ఆర్‌పేట దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్‌ పాలడగుల రమాదేవిప్రసాద్‌ దంపతులు, ఈవో నల్లూరి సతీష్‌కుమార్‌, ప్రధాన అర్చకులు కిళాంబి మారుతీ శ్రీనివాసరామానుజాచార్యులు, డాక్టర్‌ ఎంఎల్‌వీ ప్రసాద్‌, ఆర్‌కే ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.