
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ – ఆర్ఎస్ఎస్‌ను స్థాపించిన కేశవ్, 1889లో నాగపూర్‌లోని హెడ్గేవార్ కుటుంబంలో జన్మించారు. ఆయన 51 ఏళ్ళ వయసులో అంటే 1940లో మరణించారు. కాంగ్రెస్ సంస్థను 1885లో స్థాపించారు. 1947లో దేశానికి స్వతంత్రం వచ్చింది. 1889 నుంచి 1947 వరకూ ఉన్న 58ఏళ్ళ కాలంలో దేశం వివిధ స్వతంత్ర ఉద్యమాలను చవిచూసింది.
కేశవ్ ఓ గొప్ప స్వతంత్ర సమర యోధుడు. ఆయనకు ఎనిమిదేళ్ళ వయసులో ఒకసారి, బ్రిటిష్ రాణి ఎలిజబెత్ రాజ్య స్వీకార వార్షికోత్సవం సందర్భంగా బడిలో మిఠాయిలు పంచిపెట్టారు. ఆ పిన్న వయసులోనే విదేశీ పాలకుల పీడనను అర్ధం చేసుకున్న కేశవ్ ఆ మిఠాయిలను చెత్తబుట్టలోకి విసిరి కొట్టాడు. అంత చిన్నవయసు ఉన్న పిల్లవాడు అంతగా ఆత్మగౌరవాన్ని ప్రదర్శించిన సందర్భానికి అది ఒకే ఒక ఉదాహరణ అయి ఉండవచ్చు.
కాషాయ ధ్వజం ఎగరేయాలన్న కోరిక:
కేశవ్ తొమ్మిదవ తరగతి చదువుతుండగా అతనికి ఒక కోరిక కలిగింది. నాగపూర్‌లోని సీతాబుల్దీ కోట మీద ఉన్న విదేశీ యూనియన్ జాక్ జెండాను తొలగించాలన్నదే ఆ కోరిక. దానికి బదులుగా నాగపూర్ రాజవంశీకులైన భోన్సలేల సంప్రదాయ కాషాయ జెండాను ఎగరవేయాలని కేశవ్ ఆకాంక్షించాడు. కేశవ్ మెట్రిక్యులేషన్ చదువుతున్న సమయంలో ప్రభుత్వం ఒక ఉత్తర్వు జారీ చేసింది. దాని ప్రకారం వందేమాతరం గీతాలాపన చేయడాన్ని నిషేధించారు. అయితే ఆ నియమాన్ని ఉల్లంఘించాలని కేశవ్ నిర్ణయించుకున్నాడు. తోటి విద్యార్ధులు అందరూ అతనికి మద్దతుగా నిలిచేందుకు ఒప్పుకున్నారు. దానికి వారు ఒక తేదీని నిర్ణయించుకున్నారు. ఎడ్యుకేషన్ ఆఫీసర్ తమ పాఠశాలకు తనిఖీకి వచ్చే రోజును వారు ఎంచుకున్నారు. విద్యాధికారి తరగతిలోకి అడుగు పెట్టగానే ఆయనకు వందేమాతరం గీతంతో స్వాగతం పలకాలని ప్రణాళిక రచించారు. కేశవ్ నేతృత్వంలో విద్యార్ధులు ఆ పథకాన్ని చాలా కచ్చితంగా అమలు చేసారు. దాంతో పాఠశాలను రెండు నెలల పాటు మూసివేసారు. పిల్లల తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మధ్య సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. ఎట్టకేలకు ఆ చర్చలు ఫలించాయి. విద్యార్ధులందరూ మళ్ళీ బడికి వెళ్ళారు. అయితే కేశవ్ దానికి ఒప్పుకోలేదు, అతను పాఠశాలను వదిలి పెట్టేసాడు.
కేశవ్ ఇతరులను అనుకరించే వ్యక్తి కాడు. అతను స్వతంత్ర ఆలోచనలు కలిగిన వాడు, భయం లేనివాడు. తన చర్యల వల్ల ఎదురయ్యే పరిణామాల గురించి బెంగపడడం అతనికి అలవాటు లేదు. అతడు తన ఆలోచనలను ఆచరణ రూపంలో పెట్టేవాడు.
డాక్టర్ హెడ్గేవార్‌గా కేశవ్ పరిణామం:
డాక్టర్ హెడ్గేవార్ స్వతంత్ర వ్యక్తిత్వం ఆయన అన్ని నిర్ణయాల్లోనూ ప్రతిఫలించేది. కలకత్తాలో వైద్యవిద్య చదువుతున్నప్పుడు ఆయన క్రాంతికారీ అనుశీలన్ సమితిలో సభ్యుడిగా చేరారు. విప్లవకారుడిగా క్రియాశీలంగా పని చేసారు. డాక్టర్ అయిన తర్వాత ఉపాధి కోసం వైద్యవృత్తి స్వీకరించలేదు, పెళ్ళి కూడా చేసుకోలేదు. నాగపూర్ తిరిగి వచ్చిన తర్వాత సహాయ నిరాకరణ ఉద్యమంలో చేరారు. మొదటి నుంచీ ఆయన సంపూర్ణ స్వతంత్రం అన్న ఆలోచననే స్పష్టంగా ప్రకటిస్తూ ఉండేవారు. స్వతంత్రం సాధించడం ముఖ్యమే, కానీ అసలు దాన్ని ఎందుకు పోగొట్టుకున్నాము అన్న విషయాన్ని అర్ధం చేసుకోవడం, దాని గురించి ఆలోచించడం, స్వతంత్ర పోరాటంతో పాటు దాన్ని ఎప్పటికీ పోగొట్టుకోకుండా ఉండడానికి ఏం చేయాలని యోచించడం కూడా ముఖ్యమే అని ఆయన భావన.
అప్పట్లో ప్రతీచోటా హిందూ ముస్లిం సమైక్యత గురించి మాట్లాడుతూ ఉండేవారు. క్రైస్తవులు, యూదులు, పర్షియన్ల గురించి మాత్రం కనీసం ప్రస్తావన అయినా వచ్చేది కాదు. హిందూ ముస్లిం ఐక్యత గురించి మాత్రమే మాట్లాడడం వల్ల ముస్లిం సముదాయంలో ఒక వేర్పాటువాద భావన కలుగుతుందని హెడ్గేవార్ ఆలోచించారు. ఆయన తన అనుమానాన్ని గాంధీజీ దగ్గర వ్యక్తం చేసారు. దానికి గాంధీ ‘అలా జరగదు అనుకుంటున్నాను’ అని చెప్పారు. ఇంక ఆ అంశంపై చర్చను పొడిగించకుండా ఆపేసారు. దేశ స్వతంత్ర పోరాటం కంటె హిందూ ముస్లింల ఐకమత్యమే మరింత విస్తృతంగా చర్చకు వచ్చిన అంశం.
హిందువులు తమను తాము హిందువులుగా పిలుచుకోకూడదు. అప్పుడే ముస్లిములు ‘ముస్లిం’ అనే పదాన్ని విడిచి పెట్టగలుగుతారు. ఈ దేశాన్ని హిందుస్తాన్ అని పిలవకూడదు, దానికి బదులు హింద్‌స్తాన్ అని పిలవాలి. శివాజీని ఛత్రపతి అని పిలవకూడదు. అతనొక మూర్ఖుడైన దేశభక్తుడు. ముస్లిం సముదాయానికి భగవంతుడు అంటే భయం. పాపానికి దూరంగా ఉంటారు. వారు తమ మతవిశ్వాసాలను బట్టి ప్రవర్తిస్తారు. ఐక్యత సాధించడం కోసం వారి మీద ఎలాంటి నియమాలూ విధించకూడదు. అలా హిందూ ముస్లిం ఐక్యత గురించి జరుగుతున్న చర్చలను చూసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా తీవ్రంగా స్పందించారు. ‘‘హిందూ ముస్లిం ఐక్యత కోసం, తల సరైన చోట ఉన్న మనిషి ఎవరైనా అంత దూరం వెడతాడా?’’ అని ప్రశ్నించారు.
ముస్లిములు ఒక మతస్తులు, హిందువులు మరొక మతస్తులు అనే అర్ధాన్ని కలిగించారు. కానీ నిజానికి హిందువు అంటే అసలైన అర్ధం ‘సనాతన సత్యం’లో దృఢమైన విశ్వాసం ఉన్నవాడు. ఆ అర్ధాన్ని మరుగున పడవేసారు. నేతాజీ సుభాష్ చంద్ర బోస్, యోగి అరవింద్ ఘోష్ వంటివారికి కాంగ్రెస్‌లో ఇంక ఎంతమాత్రం ప్రాధాన్యత లేకుండా పోయింది. నేతాజీ ఏం చెప్పారంటే… భారతీయ సంస్కృతిలో విశేషం ఏంటంటే అది ప్రపంచానికి ఎంతో అవసరం. నాగరికత అనేది భారతీయ సంస్కృతిని వదిలిపెట్టి నిజమైన అభివృద్ధిని ఎంతమాత్రం సాధించలేదు. కాబట్టి భారతదేశం స్వతంత్ర దేశం కావాలి. యోగి అరవింద్ ఘోష్ ఏం చెప్పారంటే ప్రపంచాన్ని శాంతి వైపు, నూతన ప్రపంచ మార్గం వైపు నడిపించగలిగినది భారతదేశం మాత్రమే. ఏకం సత్ విప్రా బహుధా వదంతి (సత్యం ఒక్కటే, పండితులు దాన్ని పలు విధాలుగా చెబుతారు) అన్నదే శాశ్వతమైన నియమం. ప్రపంచ శాంతి దాని వల్లనే సాధ్యం కాగలదు.
హింస నుంచి విముక్తమైన ప్రపంచం మనకు కావాలంటే, ఈ నిజాన్ని సమాజంలో అందరికీ తెలిసేలా చేయాలి. ఆ పని చేయడానికి సమర్ధులు ఎవరు? హిందువులా లేక ముస్లిములా? అయితే, హిందువులు భారతదేశంలో ఒక వర్గంగా బతకడం మొదలుపెట్టారు. ముస్లిములు అనే అన్వయంతోనే హిందువులు అనే ఆలోచన పుట్టుకొచ్చింది.
1931లో ఆల్ ఇండియా కాంగ్రెస్ ఒక కమిటీని ఏర్పాటు చేసింది. భారతదేశపు జెండా ఎలా ఉండాలి అన్నది నిర్ణయించడం ఆ కమిటీ పని. అందులో ఏడుగురు సభ్యులు ఉన్నారు. వారు… సర్దార్ వల్లభాయ్ పటేల్, జవాహర్ లాల్ నెహ్రూ, మౌలానా ఆజాద్, మాస్టర్ తారాసింగ్, డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య, ఆచార్య కాకా కలేల్కర్, డాక్టర్ ఎన్ఎస్ హర్దీకర్. ఆ కమిటీ భారతదేశపు సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను పరిగణనలోకి తీసుకుని అధ్యయనం చేసి, ఈ దేశపు జెండా కాషాయం అనే ఒకే ఒక రంగులో ఉండాలి అని నిర్ణయించింది. ఆ నిర్ణయానికి అనుకూలంగా ఆ కమిటీ ఈ వివరణ ఇచ్చింది. ‘‘హిందీ ప్రజలు అందరినీ ఒకేసారి ప్రస్తావించాల్సి వస్తే, వారికి అత్యంత ఆమోదయోగ్యమైన రంగు ఇదే. అది ఒక ప్రత్యేకమైనరంగు. ఈ దేశం ఆ రంగును సంప్రదాయికంగా తనదిగా చేసుకుంది’’ అని ఆ కమిటీ తేల్చింది. ముస్లిముల సముదాయం నుంచి భిన్నమైన వర్గంగా హిందువులను ప్రత్యేకంగా గుర్తించినందువల్ల కాషాయ రంగును హిందువుల రంగుగా పరిగణించడం మొదలైంది. దానితో పాటే ముస్లిం వేర్పాటువాదం ఏర్పాటయింది. క్రమంగా అదే దేశ విభజనకు కారణమైంది.
హిందువుల్లో ఆత్మగౌరవాన్ని కలిగించడం:
ఎంతసేపూ హిందూ ముస్లిం ఐక్యత గురించి మాత్రమే అదేపనిగా మాట్లాడుతూ ఉండడం మీద డాక్టర్ హెడ్గేవార్ తన అనుమానాలను చాలా బలంగానే వ్యక్తీకరించారు. అటువంటి చర్చ వేర్పాటువాద మనస్తత్వానికి దారి తీస్తుందని హెడ్గేవార్ అనుమానించారు. కథలు, కీర్తనలు, సాహిత్యం, కవిత్వం… అలా ప్రతీ రంగంలోనూ ‘హిందూ’ అన్న పదాన్ని వాడడం పెద్ద పాపంగా పరిగణించేవారు. పరిస్థితి ఎలా తయారయిందంటే ‘నన్ను గాడిద అని పిలువు, కానీ హిందూ అని పిలవవద్దు’ అనే స్థితికి చేరుకున్నారు. ‘నేను హిందువును కాను, నేను మానవుడిని’ అనడం గొప్పతనంగా మారిపోయింది.
గొప్ప స్వతంత్ర సమర యోధుడు అయినందువల్ల, డాక్టర్ హెడ్గేవార్ ఈ విధంగా ఆలోచించారు. ప్రజల జ్ఞాపకాలలో నుంచి హిందూ అనే పదాన్ని తుడిచిపెట్టేస్తే స్వతంత్ర భారతదేశానికి భయంకరమైన పరిస్థితి దాపురిస్తుంది అని అర్ధం చేసుకున్నారు. హిందూ సమాజం పరిస్థితి మారిపోయి ఉంటుందని ఆయన అనుకుని ఉండి ఉంటారు. భగవద్గీత శ్లోకంలో చెప్పినట్లు ‘స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి – జ్ఞాపక శక్తి పోవడం వల్ల బుద్ధి నశిస్తుంది, బుద్ధి నశించడం వల్ల సమస్తమూ నశించిపోతుంది’. హిందూ సమాజం పరిస్థితి ఆ విధంగా మారిపోకూడదని హెడ్గేవార్ ఆలోచించారు. హిందుత్వ అనే చైతన్యాన్ని ప్రజల్లో కలిగించడానికి, దాని గురించిన అవగాహన కల్పించడానికీ ఆయన నిశ్శబ్దంగా పని చేయడం ప్రారంభించారు. ఆ పనినే ఇప్పుడు ‘రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్’ అని పిలుస్తారు.
సమాజాన్ని బలపరిచే శాఖలు:
సంఘం అంటే ఒక గంట శాఖలో పాల్గొనడం. కాషాయ ధ్వజాన్ని ఎగురవేసే పద్ధతి, ధ్వజానికి ప్రతీ ఒక్కరూ ప్రణమిల్లే పద్ధతి, ఆ తర్వాత శాఖ కార్యక్రమాల నిర్వహణ అనేవి సంఘాన్ని ఏర్పాటు చేసిన మొదటి రోజు నుంచే అమల్లోకి వచ్చాయి. డాక్టర్ హెడ్గేవార్ సంఘ శాఖలను నాటి సమాజంలోని ప్రముఖులకు చూపించడం మొదలు పెట్టారు.
ప్రస్తుతం దేశం మొత్తంలో 80 వేలకు పైగా శాఖలు జరుగుతున్నాయి. కాషాయ ధ్వజంతో నిర్వహించే శాఖల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. హిందూ అని పిలిపించుకోవడం అవమానంగా కాకుండా గొప్ప గర్వకారణంగా మారింది. ఇవాళ వందలాది సంస్థలు హిందూ అనే గర్వంతో పని చేస్తున్నాయి. ఆ సంస్థల్లో మహిళలు కూడా క్రియాశీలంగా పని చేస్తున్నారు. సమాజంలోని అన్ని వర్గాలలోనూ హిందుత్వ అనే భావనను వ్యాపింపజేయడానికి సంఘం కృషి చేస్తోంది. అడవులూ కొండల్లో నివసించే గిరిజన సోదరులు కావచ్చు, తీర ప్రాంతాల్లో నివసించే జాలరివారు కావచ్చు, స్థిరమైన ఆవాసాలు లేని దేశ దిమ్మరి తెగలు కావచ్చు… అలా అందరి దగ్గరకూ, వారు ఎంత దూరంలో అయినా ఉండనివ్వండి, వారి దగ్గరకు శాఖలను తీసుకుని వెళ్ళడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. హిందుత్వ చైతన్యం పెరుగుతున్న కొద్దీ ఆలోచనల్లో చీకట్లు తొలగిపోతాయి. శాఖ అనేది హిందుత్వం అనే సుసంపన్నమైన భావనను కలుగజేసే ప్రదేశం. కేశవ బలీరామ్ హెడ్గేవార్ అనే గొప్ప వ్యక్తికి జన్మనివ్వడం భారతమాత గొప్పదనం.





