ArticlesNews

నిన్న సెక్స్ వర్కర్.. నేడు మార్గదర్శి.. సేవాభారతి “ఉత్కర్ష్” ఔన్నత్యం ఇది

326views

ఢిల్లీలోని జీబీరోడ్‌లో ప్రత్యేకంగా సెక్స్ వర్కర్లకు సహాయం చేయాలనే ఉధ్దేశంతో సంఘ్ ప్రారంభించిన ఒక వైద్య సహాయక విభాగమైన ప్రాజెక్ట్ ఉత్కర్ష్‌లో భాగమైన సెక్స్ వర్కర్ బానోకి ఒక ప్రత్యేకత ఉంది. ఆమె అక్కడున్న వాళ్లలో ఒకరయినప్పటికీ ధైర్యానికి, దయకు తను మారుపేరు. తన పరిస్థితిని ప్రస్తావిస్తూ “నేను నా గత జీవితాన్ని మర్చిపోవాలనుకుంటున్నాను. సెక్స్ వర్కర్ నిర్వాహకులు ఆ మురికి కూపం నుండి నన్ను వెళ్లనివ్వలేదు. నన్ను చంపేస్తానని బెదిరించారు. కాని నేను ఆలోచించి అక్కడ నుంచి వెళ్లిపోవాలనుకున్నాను. ఆ సమయంలో సేవాభారతి నన్ను ఆదుకుంది. నేను పోరాడడానికి సిద్ధంగా ఉన్నాను” అని గర్వంగా చెప్పింది బానో.

సేవాభారతి చేపట్టిన ఈ ప్రాజెక్ట్ “ఉత్కర్ష్”… ప్రత్యేకంగా సెక్స్ వర్కర్ల కోసమే ఏర్పాటు చేసిన ఈ వైద్య సహాయక విభాగం ప్రాజెక్ట్ వెనుక బానో నిలిచి ఉంది. ఒక సేవాభారతి కార్యకర్తగా, ఆమె GB రోడ్‌లోని వేలాది మంది సెక్స్ వర్కర్లను ప్రాజెక్ట్ OPDలో సంరక్షణ పొందమని ప్రోత్సహిస్తోంది. ఇక్కడ AIIMS, సర్ గంగా రామ్ హాస్పిటల్, RML, సఫ్దర్‌జంగ్, లోక్ నాయక్, లేడీ హార్డింజ్‌లకు చెందిన అత్యంత అనుభవజ్ఞులైన వైద్యులు సేవా భారతి, నేషనల్ మెడికోస్ ఆర్గనైజేషన్ కింద పనిచేస్తున్నాయి. ప్రాజెక్ట్ ఉత్కర్ష్ అనేది మొట్టమొదటి సారిగా కోవిడ్ 19 సమయంలో CSWs ల ఆరోగ్య రక్షణకోసం ఏర్పాటు చేయబడింది.

సేవాభారతి ఢిల్లీ ప్రధాన కార్యదర్శి సుశీల్ గుప్తా మరిన్ని వివరాలిస్తూ… “కోవిడ్ సమయంలో ఇక్కడి మహిళలకు రేషన్ పంపిణీ చేయడానికి మేము తరచుగా జిబి రోడ్‌కి వెళ్ళినప్పుడు, ఇది మాత్రమే కాకుండా వారికి ఇంకా చాలా అవసరమని గ్రహించాము. అన్నింటికంటే ముఖ్యంగా వారికి వైద్య సహాయం అవసరం. ఉత్కర్ష్ అలా పుట్టింది. మేము సమాజాన్ని ఏకీకృతం చేశాం. అంతేకాకుండా ఈ శిథిలావస్థలో ఉన్న పాఠశాల భవనాన్ని ప్రాజెక్ట్‌ను నిర్వహించడానికి ఎంసిడి వాళ్లు ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది.. ఇది జనవరి 1, 2023న ప్రారంభమైంది. ఇప్పుడు అభివృద్ధి చెందుతోంది,” అని వివరాలిచ్చారు.

“జిబి రోడ్డులో ఆదివారం ఓపీడీకి ఇప్పుడు దాదాపు 100 మంది సెక్స్ వర్కర్లు వస్తున్నారు, వారి వార్డులలో 55 మంది ఇక్కడ నిర్వహించే రోజువారీ పాఠశాల ట్యుటోరియల్‌ల కోసం నమోదు చేసుకున్నారు. ఈ సంవత్సరం, సెక్స్ వర్కర్ల ముగ్గురు పిల్లలు ఉత్కర్ష్ కోచింగ్ సహాయంతో వారి పదవ తరగతి పరీక్షలను ఉత్తీర్ణులయ్యారు. మా వైద్య శిబిరాలు గర్భాశయ క్యాన్సర్‌తో సహా తీవ్రమైన అనారోగ్యాలకు మహిళలకు చికిత్స అందించాయి” అని లోక్ నాయక్ హాస్పిటల్‌లో గైనకాలజీ ప్రొఫెసర్, ఉత్కర్ష్ అధ్యక్షురాలు పుష్ప మిశ్రా చెప్పారు. ఈ క్లినిక్‌లో గంగా రామ్ గైనకాలజీ నిపుణుడు చంద్ర మన్సుఖాని , మాజీ గంగా రామ్ నిపుణులు కన్వాల్ గుజ్రాల్ (HOD గైనకాలజీ), డాక్టర్ సుయాష్ (మనోరోగచికిత్స) వంటి అగ్రశ్రేణి వైద్యులు సేవలు అందిస్తున్నారు.

ఈ ప్రాజెక్ట్ ప్రారంభం కావడంతో, సెక్స్ వర్కర్ల జీవితాల్లో మార్పు మొదలైంది. బానోతో సహా ముగ్గురు ఉత్కర్ష్‌లో రెగ్యులర్ ఉద్యోగాలు పొందారు. కానీ ఇక్కడికి చేరుకోవడం అంత సులభం కాలేదు. ఉత్కర్ష్ కార్యదర్శి వందన వాట్స్ గుర్తుచేసుకుంటూ, “సెక్స్ వర్కర్లు గతంలో ఇక్కడికి రావడానికి చాలా భయపడ్డారు. మేము ఎలాంటి తొందరపాటు నిర్ణయాలకూ వచ్చేవారం కామని, సహాయం చేయాలనుకుంటున్నామని వారు గ్రహించిన తర్వాత గుంపులుగా రావడం ప్రారంభించారు. నేడు, వారు ఆచరణాత్మకంగా ప్రాజెక్ట్‌ను నిర్వహిస్తున్నారు.” అని తెలిపారు.

ఇక్కడి చాలామంది మహిళలతో నమ్మకమైన సంబంధాలను ఏర్పరుచుకుంటానని వందనకు బానో ప్రమాణం చేసింది. బానో జిబి రోడ్ వ్యభిచార గృహాన్ని సందర్శించిన ఏకైక బయటి మహిళ వందన. బానో గది నంబర్ 51. “నేను వందనను నమ్ముతాను,” అని బానో గర్వంగా చెబుతుంది, మాజీ పింప్ (పింప్ అంటే వ్యభిచార గృహానికి అమ్మాయిలను తీసుకొచ్చేవాడు) అయిన అబ్దుల్ సలాంతో తన వివాహం గురించి ప్రస్తావిస్తూ… ఇప్పుడు నేను ఉత్కర్ష్‌లో పనిచేస్తున్నాను. నా భర్త ఈ-రిక్షా నడుపుతాడు. చివరికి మేము గత జీవితాన్ని మూసేసి కొత్త జీవితాన్ని ప్రారంభించామని” అని బెంగళూరుకు చెందిన బానో చెప్పారు.

బానో తల్లిదండ్రులు మరణించిన తర్వాత ఒక పరిచయస్తుడు ఆమెను ఢిల్లీకి తీసుకెళ్లి, 14 సంవత్సరాల వయసులో మొదటిసారి వ్యభిచార వృత్తిలోకి నెట్టాడని బానో చెప్పింది. “నా పొడవాటి జుట్టును కత్తిరించారు, ఆ సమయంలో సహాయం కోసం కేకలు వేశాను. నేను నా కస్టమర్లందరినీ సహాయం కోరాను, కానీ ఎవరూ చేయడానికి ముందుకు రాలేదు,” అని కానీ నేను ఈ బాధల నుంచి విముక్తి పొందడానికి ఇతర సెక్స్ వర్కర్లకు సహాయం చేస్తానని సేవాభారతిలో వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తున్న బానో ప్రతిజ్ఞ చేసింది.