News

శ్రీవారి ఆలయంపై ఆన్‌లైన్‌లో గేమ్‌ యాప్‌ కలకలం

254views

తిరుమల శ్రీవారి ఆలయం పేరుతో గేమింగ్ యాప్ వ్యవహారం వెలుగు చూసింది. అందులో ఆలయానికి సంబంధించిన వివరాలు నమోదు కావడంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు.

శ్రీవారి ఆలయంపై ఆన్‌లైన్‌లో గేమ్‌ యాప్‌ కలకలం రేపింది. తమిళనాడుకు చెందిన రోబ్లెక్స్‌ అనే సంస్థ ఈ యాప్‌ను రూపొందించింది. వర్చువల్‌ ఎక్స్‌పీరియెన్స్‌తో ఈ యాప్‌ను డిజైన్‌ చేసింది. శ్రీవారి ఆలయానికి సంబంధించిన వివరాలు.. ఇందులో ఆలయ మహ ద్వార ప్రవేశం, దర్శనం, హుండీ తదితర వివరాలు కనిపిస్తున్నాయి.

ఈ గేమింగ్‌ యాప్‌పై పలువురు భక్తులు టీటీడీకి ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ తప్పనిసరైంది. ఈ యాప్‌తో రోబ్లెక్స్ సంస్థ బారీ ఆదాయం సమకూర్చుకున్నట్లు తెలుస్తోంది.