
పాండురంగ విఠలా అంటూ భక్తి, సమ్మిళితత్వాన్ని ఎలుగెత్తి చాటుతూ ఆషాఢ శుద్ధ ఏకాదశికల్లా పండరీపూర్ చేరకుంటారు పాండురంగడి భక్తులు, వీరిని వార్కారీలు అంటారు. ఆషాఢమాసంలో జరిగే ఈ యాత్రను వారి యాత్ర అంటారు. మహారాష్ట్ర భక్తి సంస్కృతికి జీవనాడిగా ఈ యాత్రను పరిగణిస్తారు. ఇది మత సామరస్య చిహ్నం కూడా, ఇక్కడ విభిన్న వర్గాల ప్రజలు సాంప్రదాయకంగా వార్కారీలకు ఆహారం, నీరు, ఆశ్రయం ఇచ్చి సేవ చేస్తారు.
ఈ పవిత్రమైన యాత్రలో ఇటీవల ఓ దురదృష్టకరమైన సంఘటన జరిగింది. పూణేలోని క్యాంపు ప్రాంతం గుండా ఈ యాత్రీకులు వెళుతుండగా వీరిపై మాంసం, ఎముకల ముక్కలను విసిరేసిందో ముస్లిం మహిళ. ఈమెను దర్గా మామాదేవి చౌక్ సమీపంలోని సోలాపూర్ రోడ్ నివాసి నసీమ్ షేక్ (57)గా గుర్తించారు.
యాత్రలో పాల్గొన్న ఛత్రపతి సంభాజీనగర్ నివాసి అక్కల్వంత్ రాథోడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు లష్కర్ పోలీస్ స్టేషన్ కేసు నమోదు చేసింది. వార్కారీలు మామాదేవి చౌక్ వద్ద శాంతియుతంగా ముందుకు వెళుతుండగా నసీమా షేక్ వారి యాత్రికులపై మాంసం ముక్కలు విసిరింది. దీంతో ఆగ్రహించిన రాథోడ్ ఎందుకు ఇలా చేశావని అడగ్గా… “నీకు నచ్చింది చేసుకో.. నేను భయపడను.. అంటూ ఎదురు సమాధానం చెప్పింది, అని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ సంఘటన జరిగిన వెంటనే రాథోడ్ వెంటనే యాత్రికుల భద్రత కోసం నియమితుడైన పోలీసు అధికారికి సమాచారం అందించాడు. ఆ అధికారి ఎముకను పారవేసి, అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రాథోడ్‌కు హామీ ఇచ్చాడు. తదనంతరం, రాథోడ్ నసీమ్ షేక్‌పై అధికారికంగా ఫిర్యాదు చేయడానికి లష్కర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు.
భక్తుల్లో ఆగ్రహం..
ఈ సంఘటన వల్ల అనేక మంది వార్కారీలు, హిందూ సంస్థలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆషాడి వారి యాత్ర పవిత్రతను దెబ్బతీసేందుకు ఉద్దేశపూర్వకంగా చేసిన ప్రయత్నమని అనేక మంది భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో జరిగిన ఉద్రిక్తతల దృష్ట్యా, తీర్థయాత్ర పవిత్రతను కాపాడటానికి, మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం వారి ఊరేగింపు వెళ్ళే అన్ని ప్రాంతాలలో మాంసం, మద్యం అమ్మకాలపై నిషేధాన్ని అమలు చేసింది, ఇందులో పండర్‌పూర్‌లో ఈ ఆషాఢమంతా కూడా వీటిపై కఠినమైన నిషేధం కూడా ఉంది. ఇటువంటి నిబంధనలు ఉన్నప్పటికీ, ఈ సంఘటన జరగడం మతపరమైన రెచ్చగొట్టే అంశంగా భావిస్తున్నారు.
ఆషాఢి వారి యాత్ర మతపరమైన రెచ్చగొట్టే ప్రయత్నాలను ఎదుర్కోవడం ఇదే మొదటిసారి కాదు. ఈ సంఘటనకు కొన్ని రోజుల ముందు, పూణేలోని ఫాతిమానగర్‌లో కూడా ఇలాంటి సంఘటనే జరిగిందని ఒక వీడియో వైరల్ అయింది. ఇందులో ఒక మహిళ మారువేషంలో వార్కారీలకు బైబిల్ కరపత్రాలను పంపిణీ చేస్తున్నట్లు చూపిస్తుంది. క్రైస్తవ మిషనరీలు కూడా ఇప్పుడు వారి యాత్ర సమయంలో బైబిల్ కరపత్రాలను వార్కారీలకు ఇవ్వడం ద్వారా భగవాన్ విఠల భక్తులను లక్ష్యంగా చేసుకుంటున్నారు!
అప్రమత్తంగా ఉండాలని పిలుపు..
ఆషాఢీ వారి యాత్ర హిందూ ఐక్యత, సామూహిక భక్తికి ప్రతిరూపంగా కొనసాగుతున్నప్పటికీ, ఇటువంటి రెచ్చగొట్టే సంఘటనలు ఈ కార్యక్రమం ఆధ్యాత్మిక పవిత్రతను దెబ్బతీసే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రభుత్వం ఇలాంటి సున్నితమైన అంశాలపై తగిన చర్యలు తీసుకోవాలని భక్తులు, ఆధ్యాత్మికవాదులు, హిందూ సంఘాలు కోరుతున్నాయి.





