
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ప్రాంత ప్రచారక్‌ల కీలకమైన సమావేశాలను జూలై 4 నుండి 6 వరకు దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించనుంది. ఈ సమావేశానికి సర్‌సంఘ్‌చాలక్ డాక్టర్ మోహన్ భగవత్‌తో పాటుగా సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబాళేతో సహా అగ్రశ్రేణి సంఘ ప్రతినిధులు హాజరవనున్నారు. ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలలో భాగంగా చేయబోయే సామాజిక కార్యక్రమాలు, సైద్ధాంతిక విస్తరణతో పాటుగా రాబోయే సంవత్సరానికి చెందిన ప్రణాళిక విస్తరణ, అంతర్గత సమన్వయం, స్వయంసేవకుల శిక్షణ నైపుణ్యాల గురించి, ప్రస్తుత సంస్థాగత కార్యకలాపాలను సమీక్షించడంతో పాటుగా గత మే, జూన్ నెలల్లో జరిగిన సంఘ శిక్షావర్గ సమీక్షను గురించి ఈ సమావేశాలలో చర్చిస్తారు. ఆర్‌ఎస్‌ఎస్ సర్‌సంఘ్‌చాలక్ డాక్టర్ మోహన్ భగవత్ ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. ఈ సమావేశంలో వివిధ జిల్లాల నుంచి 11 మంది ప్రాంతీయ ప్రతినిధులు, 46 మంది ప్రచారక్‌లతో పాటు, జ్యేష్ట స్వయంసేవకులు పాల్గొననున్నారు.





