News

పృథ్వి – 2 ప్రయోగం విజయవంతం

962views

దేశీయంగా అభివృద్ధి చేసిన అణుసామర్థ్యం ఉన్న పృథ్వి-2 క్షిపణిని డీఆర్‌డీవో రాత్రి వేళ విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరంలోని చాందీపూర్‌ వద్ద ఇంటిగ్రేటెడ్‌ టెస్ట్‌ రేంజ్‌ కాంప్లెక్స్‌-3 నుంచి 3/12/2019 వ తేది మంగళవారం సాయంత్రం 7:48 సమయంలో ఈ ప్రయోగం జరిగినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. స్ట్రాటజిక్‌ ఫోర్సెస్‌ కమాండ్‌ రాత్రి వేళ ఈ పరీక్షను నిర్వహించినట్లు తెలిసింది. ఉపరితలం నుంచి ఉపరితలానికి స్వల్పశ్రేణి దూరాలకు ప్రయోగించగల ఈ క్షిపణికి అణు సామర్థ్యం కూడా ఉంది. ఇది 500 నుంచి 1000 కిలోల బరువైన వార్‌హెడ్‌లను మోసుకు పోగలదు. ద్రవ ఇంధనంతో పనిచేసే ఈ క్షిపణిని 2003లో భారత రక్షణ దళాలకు అప్పగించారు.

మరిన్ని జాతీయఅంతర్జాతీయ వార్తలువిశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.