
మత ఘర్షణల కారణంగా పొరుగు దేశాల నుంచి పారిపోయి వచ్చి భారత్‌లో ఆశ్రయం కోరుతున్న వారి కోసం తీసుకొచ్చిన ‘పౌరసత్వ సవరణ బిల్లు’కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ వారంలో బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. ఈ బిల్లు ప్రవేశపెట్టే సమయంలో సభ్యులు తప్పనిసరిగా హాజరుకావాలని పార్టీ అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది. బంగ్లాదేశ్, పాకిస్థాన్, అఫ్గానిస్థాన్‌వంటి దేశాల నుంచి వచ్చిన హిందువులు, సిక్కులు, బుద్ధులు, జైనులు, పార్శీలు, క్రైస్తవులకు భారత పౌరసత్వం కల్పించేలా 1955 నాటి పౌరసత్వ చట్టంలో సవరణలు చేస్తూ ఈ బిల్లును రూపొందించారు. కాగా భారతదేశంలో 11 ఏళ్లపాటు ఉండాలనే నిబంధనను ఆరేళ్లకు తగ్గించారు. కాగా ఈ సవరణ బిల్లుపై ఈశాన్య రాష్ట్రాలకు చెందిన కొన్ని సంస్థలు, ప్రతిపక్ష నేతల నుంచి పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. పార్లమెంట్‌లోనూ ఈ బిల్లును వ్యతిరేకించాలని ప్రతిపక్షాలు యోచిస్తున్నాయి.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.





