News

ఒకే ఒక్క రోజు… 6 దేవాయాల దోపిడీ .. హిందూ గృహాల ధ్వంసం

235views

బంగ్లాదేశ్ లో హిందూ వ్యతిరేకులు రెచ్చిపోతున్నారు. ఆపినట్లే ఆపి… మళ్లీ దాడులకు, దేవాలయాలే టార్గెట్ గా విధ్వంసం సృష్టిస్తున్నారు. అయినా అక్కడి ప్రభుత్వం మాట్లాడటమే లేదు. కేవలం ఒక్క రోజులోనే ఆరు హిందూ దేవాయాలను ఛాందసులు దోచుకున్నారు. ఈ ఘటన ఈ నెల 13 న జరిగింది. బంగ్లాదేశ్ లోని గోపాల్ గంజ్ జిల్లాలోని కోటాలిపారా ప్రాంతంలో జరిగింది.

అదే విధంగా జూన్ 12 న దువారిపారాలోని ఓ హిందూ దేవాయంలో చోరీ జరిగింది. అదే రోజు మరో 4 హిందూ దేవాలయాలను దోచుకున్నారు. పూజకు సంబంధించిన అన్ని వస్తువులనూ దోచుకెళ్లారని స్థానిక మహిళలు వాపోయారు. స్థానిక హిందూ మహిళల ప్రకారం ‘‘ఇలాగే ప్రతిసారీ దొంగతనాలు జరిగితే కష్టమే. ఇత్తడితో పాటు ఇతర లోహాలతో చేసిన పూజా పాత్రలను కొనడానికి చాలా డబ్బే ఖర్చవుతుంది. ప్రతిసారీ కొనడానికి మా దగ్గర డబ్బులు లేవు’’ అని వాపోయారు.

మరో హిందూ మహిళ మాట్లాడుతూ.. ‘‘మా దేవాలయాలకు సంబంధించిన విలువైన వస్తువులను దోచుకోవడాన్ని ప్రభుత్వం అడ్డుకట్ట వేయాలి. అవసరమైన చర్యలు తీసుకోవాలి. హిందూ సమాజంపై అనేక దారుణాలు జరుగుతున్నాయి. ఎలా బతకాలి? ప్రభుత్వం దృష్టి సారించాలి. నేరస్థులను పట్టుకునే పని ప్రభుత్వానిదే. ’’ అని తెలిపారు.

మరో హిందూ మహిళల మాట్లాడుతూ.. తాను ఉదయం దర్శనార్థం వచ్చినప్పుడు అమ్మవారి చెవిపోగులు కనిపించలేదని, రాధాకృష్ణుడు, మానస మాతను అద్భుతంగా అలంకరించామని, వచ్చే సరికి ఆ అలంకరణ కూడా లేదన్నారు. ‘‘మా ఆలయంలో చాలా వరకు ఇత్తడివే. రాధా కృష్ణుని విగ్రహం మాత్రం వెండితో తయారు చేశారు. నాలుగు సంవత్సరాలుగా పూజలు చేస్తూనే వున్నా.’’ అని పేర్కొంది.

కేవలం దేవాలయాలే కాదు.. హిందువుల ఇళ్లు కూడా టార్గెట్…
మరోవైపు నేత్రోకోన జిల్లాలోని పుర్బధల ప్రాంతంలో హిందువులపై దోపిడీ కొనసాగుతోంది. హరిదాస్ వర్గానికి చెందిన అనేక హిందూ కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. కొన్ని రోజుల కిందటే ముస్లింలు హిందువుల ఇళ్లను ధ్వంసం చేశారు. వస్తువులను దోచుకున్నారు.

50 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో హిందువులు నివసిస్తున్నారు. కానీ… బలవంతంగా వారిని భయపెట్టి, ఖాళీ చేయించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.ఇప్పుడు ముస్లిం ఛాందసులు ఈ ప్రాంతాన్ని ‘జనాబ్ అలీ మర్కజున్ నూర్ అల్ ఇస్లామియా మదర్సా’ ఆస్తిగా ప్రకటిస్తూ సైన్ బోర్డులు పెట్టారు.

దీంతో హిందువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ముస్లిం ఛాందసులు హిందువుల నివాసాలనే లక్ష్యంగా చేసుకుంటూ దాడులకు దిగారు. ఈ దాడుల్లో కనీసం హిందువులకు సంబంధించి 5 ఇళ్లు ధ్వంసమయ్యాయి. విలువైన ఆభరణాలను కూడా ముస్లిం ఛాందసులు ఎత్తుకెళ్లిపోయారు.