
హైందవ ధర్మ విశిష్టత ప్రపంచానికి చాటి చెప్పడంలో శివస్వామి కృషి ఎనలేనిదని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం తాళ్ళయపాలెంలోని శైవ క్షేత్రంలో ధర్మోరక్షతి రక్షితహ ట్రస్ట్ నూతన భవనం ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ట్రస్ట్ నూతన భవనం ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. నిర్మాణ దాతలు సతీష్ ఉమరాణి దంపతులకు ధన్యవాదాలు తెలియజేశారు. శివస్వామి ఈ ట్రస్ట్‌లో 64 సేవా విభాగాలు ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు. గో సంరక్షణ ద్వారా ఆరు వేల గోవులను రక్షించి వాటి పోషణ చూసుకోవడం అభినందనీయమన్నారు. మానసారా–మన సారె అనే కార్యక్రమం ద్వారా అనేక రాష్ట్రాల్లో అమ్మవారికి కార్యక్రమాలు నిర్వహిస్తూ సాంస్కృతి పట్ల యువతకు అనేక ప్రయోజకర కార్యక్రమాలు అందిస్తున్నారన్నారు. భక్తునిగా శివస్వామికి తాను శిరస్సు వచ్చి పాదాభివందనలు చేస్తున్నారన్నారు. శివస్వామి మాట్లాడుతూ ధర్మోరక్షతి రక్షితహ భవనాన్ని ధార్మిక సేవా భావాలతో 2009 నుంచి నిర్వహిస్తున్నానని తెలిపారు. రాష్ట్రంలో ఎనిమిది వేల మంది ఈట్రస్ట్ కేంద్రంగా పనిచేస్తున్నారన్నారు. పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.





