
167views
వైయస్సార్ కడప జిల్లా పెండ్లిమర్రి మండలంలోని కొత్తగిరియంపల్లె గ్రామానికి చెందిన రైతు నడిపి సుబ్బారెడ్డి పొలంలో వినాయక విగ్రహం బయల్పడింది. వెల్లటూరు గ్రామ రెవెన్యూ భూమిలోని భేతాళ ఆంజనేయస్వామి గుడి దగ్గరలోని పొలంలో.. ఆయన ట్రాక్టర్‌తో సేద్యం చేస్తుండగా గొర్రుకు పెద్ద రాయి తగిలింది. దానిని వెలికితీయగా వినాయక విగ్రహం కనిపించింది. దీంతో సమాచారం ఇవ్వడంతో గ్రామస్తులు అక్కడికి చేరుకొని వినాయక విగ్రహానికి టెంకాయలు కొట్టి పూజలు చేశారు. పూర్వం ఈ ప్రదేశంలో గుడి ఉండి ఉంటుందని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు.





