
153views
ప్రతి 12 ఏళ్లకోసారి నిర్వహించే నాసిక్-త్రయంబకేశ్వర్ సింహస్థ కుంభమేలా వచ్చే ఏడాది అక్టోబరు 31 నుంచి ప్రారంభం కానుంది. ఆరోజున త్రయంబకేశ్వర్‌తో పాటు నాసిక్‌లోని రామ్‌కుండ్‌లో ధ్వజారోహణ చేపట్టనున్నారు. 2027 ఆగస్టు 2న గోదావరి నదిలో తొలి అమృత స్నానాల క్రతువును, అదే నెల 31న రెండో స్నానం, సెప్టెంబరు 11న మూడో స్నానం నిర్వహించనున్నారు. 2028 జులై 24న కుంభమేలా ముగియనుంది. నాసిక్‌లో ఆదివారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడణవీస్ అధ్యక్షతన జరిగిన సాధువులు, మహంతుల సమావేశంలో ఈ మేరకు తేదీలను ప్రకటించారు. కుంభమేలాకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేయనున్నట్లు ఫడణవీస్ చెప్పారు. సుమారు రూ.6000 కోట్లతో పనులు చేపట్టేందుకు టెండర్లను ఆహ్వానించనున్నట్లు తెలిపారు.





