News

పేరు మార్చుకుని హిందూ యువతిపై అత్యాచారం చేసిన ముస్లిం యువకుడు

197views

ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో షరీఖ్ అబ్బాస్ అనే ముస్లిం యువకుడు తనను తాను దీపక్ రాయ్ గా పరిచయం చేసుకుని ఒక హిందూ అమ్మాయితో సన్నిహితంగా మెలిగి ఆమెపై అత్యాచారం చేశాడు. షరీఖ్ ముస్లిం అని తెలుసుకున్న, బాధిత హిందూ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడు డబ్బు మరియు బలవంతం ఉపయోగించి ఆమెపై ఒత్తిడి తెచ్చాడు.

షరీఖ్ ఆ అమ్మాయిని అశ్లీల వీడియోలు తీసి బెదిరించాడు. షరీఖ్ ఆమె ప్రైవేట్ పార్ట్స్‌లో బీరు పోసి ఆమెను హించించేవాడు. ఆమె నిరసన తెలిపినప్పుడు, ఆమెను కొట్టేవాడు.

బాధిత హిందూ యువతి న్యూ ఆగ్రాలోని ఒక విద్యా సంస్థకు వెళ్లేది. స్తానికుడు అయిన షరీఖ్ అబ్బాస్ కూడా అదే విద్యా సంస్థకు వెళ్లేవాడు. అతను తనను తాను దీపక్ రాయ్ అని పరిచయం చేసుకున్నాడు. నిందితుడు హిందూ అమ్మాయికి దగ్గరవ్వడం ప్రారంభించాడు. ఆమెను శారీరకంగా లోబరుచుకున్నాడు. బాధిత హిందూ యువతి షరీఖ్ ముస్లిం అని నిజం తెలుసుకున్నప్పుడు, అతని నుండి విడిపోయింది; కానీ అతడు ఆమెను బెదిరిస్తూనే ఉన్నాడు.

షరీఖ్ బెదిరింపులతో విసిగిపోయిన ఆమె ఉన్నత విద్య కోసం ఢిల్లీకి వెళ్లింది. షరీఖ్ అక్కడ కూడా ఆమెను వెంబడించడం కొనసాగించాడు.ఆమెను బలవంతం చేసి వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేస్తూనే ఉన్నాడు. ఇస్లాం మతంలోకి మారాలని, ఖురాన్ లోని కొన్ని శ్లోకాలు చదవాలని ఆమెపై ఒత్తిడి తేవడంతో బాధిత హిందూ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.