News

హైందవ ధర్మ రక్షణకు ముందుకు రావాలి

190views

హైందవ ధర్మాన్ని కాపాడేందుకు ప్రతీ ఒక్కరూ విధిగా ముందుకు రావాలని ఆంధ్ర ప్రదేశ్ సాధు పరిషత్ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీనివాస నంద స్వామి పిలుపునిచ్చారు. శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం బురుడి కంచరాం గ్రామంలో శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయ ప్రతిష్టా మహోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసనంద స్వామి మాట్లాడుతూ, మన దేశాన్ని ధర్మాన్ని కాపాడుకొనే బాధ్యత అందరిపై ఉందని అన్నారు. ఉగ్రవాదుల దాడులను త్రిప్పి కొట్టడంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం విజయవంతం అయిందని అన్నారు.అభయ ఆంజనేయ స్వామి వారి ఆశీస్సులు నిండుగా దండిగా అందరకీ వుండాలని ఆయన ఆకాక్షించారు. ఈ సందర్భంగా హనుమాన్ మాలధారణ చేసిన 550 మంది భక్తులతో శోభాయాత్ర వైభవంగా నిర్వహించారు.

ఆంజనేయ స్వామి ధర్మాన్ని కాపాడేందుకు ఆనాడు రాక్షసులను సంహరించిన తరహాలో నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఉగ్ర వాదులకు పూర్తిగా అదుపులో పెట్టే చర్యలు చేపట్టారని ఇది ముమ్మాటికీ దేశ సమగ్రత.. సమైక్యత కాపాడేందుకు చిత్తశుద్ధితో పని చేస్తున్నారని ఆయన కొనియాడారు..