
279views
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలోని ధ్రువమూర్తుల చిత్రాలపై రామాలయానికి కాపీ రైట్స్ లభించాయి. ప్రధాన కోవెలలో సీతారామ లక్ష్మణుల వారి విగ్రహాలు దర్శనమిస్తాయి. ఇందులో అలంకరణతో ఓ ఛాయాచిత్రం, అలంకరణ లేకుండా మరో చిత్రం కనిపిస్తుంటాయి. కాపీ రైట్స్ నిబంధనల ప్రకారం.. ఇక నుంచి రామాలయ అధికారుల అనుమతి తీసుకున్న తరవాతే ఈ ధ్రువమూర్తుల ఫొటోలను ముద్రించాల్సి ఉంటుంది. వాటి విక్రయాలకూ అధికారుల అనుమతి తప్పనిసరి. ఈ విషయంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చట్టపరంగా చర్యలు ఉంటాయని ఆలయ ఈఓ రమాదేవి తెలిపారు. జూన్ 20 తర్వాతి నుంచి అమలులోకి వచ్చే ఈ కాపీ రైట్స్ పదేళ్ల వరకు వర్తిస్తాయి. ఆర్థిక, వ్యాపార పరమైన లావాదేవీల్లో ఈ చిత్రాలను ఉపయోగించకూడదన్న ఉద్దేశంతో ఈ హక్కులు తీసుకున్నట్లు ఈవో స్పష్టం చేశారు.





