News

శ్రీవారి భక్తులకు క్యూలైన్ షెడ్లు

327views

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ మరో సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. తిరుమలలోని విష్ణు నివాసం, వసతి సముదాయం, శ్రీనివాసం, మాధవం, భూదేవి కాంప్లెక్స్‌లో ఉచిత దర్శన టోకెన్లు అందిస్తున్నారు. భూదేవి కాంప్లెక్స్ వద్ద ఎస్ఎస్డీ టోకెన్ల కోసం వచ్చిన భక్తులు ఫెన్సింగ్ వేసిన క్యూలైన్లలో గంటల తరబడి నిలుచోవాల్సి వచ్చేది. ఒక్కోసారి తోపులాటలు చోటు చేసుకునేవి. తిరుమల నారాయణగిరి తరహాలో శాశ్వత క్యూలైన్ షెడ్లు ఏర్పాటు చేశారు. భక్తులకు ఎండ, వాన నుంచి రక్షణ లభిస్తుందని టీటీడీ అధికారులు తెలిపారు.

తిరుమలలో టీటీడీ ఈఓ ఆకస్మిక తనిఖీలు
టిటిడి ఈఓజె. శ్యామలారావు తిరుమలలోని సహజ శిలా తోరణం మరియు చక్ర తీర్థాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు.తన తనిఖీలో భాగంగా ఈ ప్రాంతాలలో పార్కింగ్, శుభ్రత, మొదలైన అంశాలను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు.అనంతరం ఆయన చక్ర తీర్థం రాతి కొండలో చెక్కి ఉన్న సుదర్శన చక్రత్తాళ్వార్, నరసింహ స్వామి, ఆంజనేయ స్వామి ప్రతిమలను మరియు అక్కడే ఉన్న శివుని సాన్నిధ్యాన్ని కూడా పరిశీలించారు.ఈ సందర్బంగా ఆ ప్రాంగణంలో పరిశుభ్రత మెరుగుపరచాలని ఆయన సంబంధిత అధికారులను ఆదేశించారు