News

శని శింగనాపూర్ ఆలయ పవిత్రను కాపాడాలి

302views

మహారాష్ట్రలోని అహల్యా నగర్ లో లక్షలాది మంది హిందువుల ప్రార్థనా స్థలం అయిన శ్రీ శని శింగనాపూర్ ఆలయ పవిత్ర వేదికను శుభ్రం చేయడానికి ముస్లిం కార్మికులతో ‘గ్రిల్’ను ఏర్పాటు చేశారు. ఈ సంఘటన దిగ్భ్రాంతికరంగా ఉండటమే కాకుండా, ఆలయ పవిత్రత, మత సంప్రదాయాన్ని ఉల్లంఘించడమేనని స్థానిక గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటనను మహారాష్ట్ర మందిర్ మహాసంఘ్ తీవ్రంగా ఖండించింది. సంబంధిత ముస్లిం ఉద్యోగుల పనిని వెంటనే నిలిపివేయాలని మహాసంఘ్ జాతీయ నిర్వాహకుడు శ్రీ సునీల్ ఘన్వత్ అన్నారు. ఇక్కడ పనిచేస్తున్న 300 మంది ముస్లిం ఉద్యోగులను తొలగించాలని, అదేవిధంగా, వారికి ప్రవేశం కల్పించడానికి బాధ్యత వహించే అధికారులను క్షుణ్ణంగా విచారించి, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కానీ పక్షంలో, రాష్ట్రవ్యాప్తంగా ప్రజా ఉద్యమం చేపడతామని చెప్పారు.

శని శింగనాపూర్ వంటి తీర్థయాత్ర కేంద్రంలో ఇతర మతాలవారిని పని చేయించడం హిందూ సమాజ విశ్వాసం, సంప్రదాయాలపై ప్రత్యక్ష దాడి అని చెప్పారు, ప్రస్తుతం ఆలయంలో దాదాపు 300 మంది ముస్లిం ఉద్యోగులు పనిచేస్తున్నారు అని వీరి ఉనికి ఆలయ మతపరమైన పవిత్రతను ప్రభావితం చేస్తుందన్నారు.ఆలయ సంబంధిత వ్యక్తులను సంప్రదించి, పనిని వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. కాగా ఈ పని నిలిపివేయబడిందని అధికారులు తెలియజేశారు. అయితే, ఈ పనిని ప్రారంభించి ముస్లిం ఉద్యోగులను నియమించిన అధికారులపై చర్య తీసుకోవడం అవసరం చెప్పారు.

ఆంధ్రప్రదేశ్‌లోని తిరుమల ఆలయంలో ఇలాంటి సంఘటన జరిగిన తర్వాత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హిందూ ఉద్యోగులను మాత్రమే నియమించాలని ఆదేశించార.. మహారాష్ట్ర ప్రభుత్వం కూడా త్వరలోనే ఇలాంటి కఠినమైన నిర్ణయం తీసుకోవాలని కోరారు.