
ఆపరేషన్ సిందూర్ సమయంలో ఐఎన్ఎస్ విక్రాంత్ ఆచూకీ చెప్పాలంటూ కొచ్చి నావికా స్థావరానికి కాల్ చేసిన ముజీబ్ రహ్మాన్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో తనను తాను రాఘవన్ గా పరిచయం చేసుకున్నాడు. తాను ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి మాట్లాడుతున్నానని, విక్రాంత్ ఎక్కడుందో కోఆర్డినేట్స్ కావాలంటూ ఫోన్ చేశాడు. దీంతో అధికారులకు అనుమానాలు వచ్చాయి. వెంటనే ఫోన్ కట్ చేసి, వెంటనే కొచ్చి నావికా స్థావరం అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో పోలీసులు విచారణ చేసి, ముజీబ్ రహ్మాన్ గా గుర్తించి, అరెస్ట్ చేశారు. రహ్మాన్ స్వస్థలం కోజికోడ్. అయితే.. పోలీసులు కాల్ చేయగానే స్విచ్చాఫ్ చేసి పెట్టేశాడు. చివరికి సాంకేతికత సహాయంతో పోలీసులు రెహ్మాన్ ను అదుపులోకి తీసుకున్నారు.
నిజానికి ముజీబ్ రెహ్మాన్ తరుచుగా పాకిస్తానీ సోషల్ మీడియా హ్యాండిల్స్ ను ఫాలో అవుతున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో అతని భావాలు కూడా అతివాద భావాలుగా వున్నట్లు కూడా గుర్తించారు. అంతేకాకుండా డ్రగ్స్ కి బానిస కూడా అని తెలిపారు. తదుపరి విచారణ కొనసాగుతుందని పోలీసులు తెలిపారు.
అయితే పోలీసుల విచారణలో సోషల్ మీడియా అకౌంట్ల పాస్ వర్డ్ లను చెప్పడానికి నిరాకరించాడు. దీంతో పోలీసులు అతని డిజిటల్ కార్యకలాపాలను క్షుణ్ణంగా పరిశీలించారు. డేటాను కూడా సేకరించారు. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ అకౌంట్లను తరుచుగా చూసేవాడని తేలింది. అంతేకాకుండా ఏయే ప్రాంతాలకు కూడా ప్రయాణాలు చేశాడన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఉద్దేశపూర్వకంగానే దర్యాప్తుకు సహకరించడం లేదని పోలీసులు నిర్ధరణకు వచ్చారు. దీంతో మరింత లోతైన విచారణను చేస్తోంది.





