News

నువ్వు హిందువా?.. కశ్మీరీలా లేవే

385views

పహల్గాం ఉగ్రదాడి దర్యాప్తులో పలు కోణాలు బయటకు వస్తున్నాయి. దాడికి ముందు రోజు ఒక అనుమానిత ఉగ్రవాది తనతో మాట్లాడినట్లు మహారాష్ట్రలోని జాల్నాకు చెందిన పర్యాటకుడు ఆదర్శ్‌ రౌత్‌ వెల్లడించారు. ఇటీవల కశ్మీర్‌ పర్యటనకు వెళ్లిన తాను పహల్గాం దాడికి ముందురోజు అక్కడే ఒక అనుమానిత వ్యక్తితో మాట్లాడానని, ఎన్‌ఐఏ విడుదల చేసిన ఉగ్రవాదుల ఊహాచిత్రాలను చూశాక అనుమానం మరింత బలపడినట్లు తెలిపారు.

‘‘ఏప్రిల్‌ 21న పహల్గాంకు వెళ్లా. బైసరన్‌ వ్యాలీలో మ్యాగీ స్టాల్‌ వద్ద తినేందుకు ఆగా. ఓ వ్యక్తి నా వద్దకు వచ్చి ‘నువ్వు హిందువా?.. కశ్మీర్‌కు చెందినవాడిలా లేవే!’ అని ఆరా తీశాడు. ఆ తర్వాత నా పక్కనున్న వ్యక్తితోనూ మాట్లాడాడు. ఈ రోజు రద్దీ తక్కువగా ఉందని అన్నాడు. అతడు ఎందుకలా మాట్లాడుతున్నాడో అర్థం కాక కొంత కలవరపడ్డా. తర్వాత రోజు అక్కడే ఉగ్రదాడి జరిగింది’’ అని ఆదర్శ్‌ తనను విస్మయానికి గురిచేసిన అనుభవాన్ని మీడియా ముందు గుర్తు చేసుకున్నారు. ఈ వివరాలను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అధికారులకు మెయిల్‌ చేసినట్లు ఆయన తెలిపారు.