
జమ్ముకశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకులను ఉగ్రమూకలు అత్యంత పాశవికంగా కాల్చి చంపడ పిరికిపంద చర్య అని హిందూ ఐకాస నాయకులు మండిపడ్డారు. ఘటనను నిరసిస్తూ కడప నగరంలోని కోటిరెడ్డి కూడలి నుంచి ఏడు రోడ్ల కూడలి వరకు శుక్రవారం సాయంత్రం భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అక్కడ మానవహారం ఏర్పాటు చేసి మృతులకు సంతాపం తెలుపుతూ కొవ్వొత్తులు వెలిగించి రెండు నిమిషాల పాటు మౌనం పాటించి నివాళులర్పించారు. అనంతరం ఉగ్రవాదుల దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఈ
సందర్బంగా పలువురు హిందూ ధార్మిక వేత్తలు,పీఠాధిపతులు మాట్లాడుతూ ఇలాంటి ఘటనలను అందరూ ఖండించాలని పిలుపునిచ్చారు. ఉగ్రమూకలను భారత ప్రభుత్వం తప్పకుండా తుదముట్టించి ప్రతీకారం తీర్చుకుంటుందని పేర్కొన్నారు. దేశంలోని హిందువులందరూ ఏకమై ఇలాంటి దుశ్చర్యలను అడ్డుకోవాలన్నారు.

కార్యక్రమంలో వీహెచ్పీ, హిందూ ఐకాస నాయకులు, స్వామీజీలు, కార్యకర్తలు, మహిళలు, విద్యార్థులు, ఎన్సీసీ విద్యార్థులు, వివి పార్టీల నాయకులు పాల్గొన్నారు.





