News

అన్నవరం కొండపై అన్యమత భజనలు

942views

అన్నవరం సత్యదేవుని సన్నిధిలో ఒక భజన బృందం అన్యమత కీర్తనలు ఆలపించడం ఉద్రిక్తతకు దారి తీసింది. తూర్పు గోదావరి జిల్లా ఇరుపాక గ్రామానికి చెందిన అనిమిరెడ్డి నగేష్ నటరాజ బాల భక్త సంఘం సభ్యులతో కళామందిరంలో భక్తి గీతాలు, భజనలను దేవస్థానం అధికారులు ఏర్పాటు చేశారు. సదరు భజన మండలి అన్య మత పరమైన వ్యాఖ్యలు చేస్తూ ఏసుక్రీస్తును కీర్తిస్తూ భజన చేయడంతో మైకులో విన్న విజయవాడకు చెందిన భక్తులు ఎన్. సుధాకర్, పి. వెంకటేశ్వరరావు, ఉమాదేవి తదితరులు దేవస్థానం రిసెప్షన్ విభాగంలో ఫిర్యాదు చేశారు. దీంతో చైర్మన్ ఐవీ పురోహిత్, సిబ్బంది హుటాహుటిన కళా వేదిక వద్దకు వచ్చి భజనను నిలిపివేయించారు. ఈ సందర్భంగా దేవస్థానం సూపరింటెండెంట్ కొండలరావుపై భజన బృందం సభ్యుడొకరు ఎదురు తిరగడం ఉద్రిక్తతకు దారి తీసింది. దీంతో హిందూ దేవాలయంలో అన్య మత గీతాలు ఆలపించిన బృంద సభ్యులపై సిబ్బంది పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి వారిని పోలీసులకు అప్పగించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.