
424views
ప్రకాశం జిల్లా పీసీపల్లి మండలంలోని పెదఇర్లపాడు మల్లేశ్వరస్వామి ఆలయ భూముల కబ్జాపై రెవెన్యూ, ఆలయ అధికారులు చర్యలు చేపట్టారు. గ్రామ సమీపంలోని ఈ ఆలయానికి చెందిన 133 సర్వే నంబర్‌లో 15 ఎకరాల విలువైన పొలం ఉంది. దీని చెంతనే గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి కూడా భూమి ఉంది. తన భూమితో పాటు ఆలయానికి చెందిన సుమారు ఒక ఎకరం భూమిలో ప్లాట్లు వేసి రాళ్లు పాతారు. ఈ విషయంపై ఆలయ ఈవో కొండారెడ్డి రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో బుధవారం ప్లాట్లు వేసిన ప్రాంతంలో వీఆర్వో రఫీ, ఆలయ ఈవో ఆధ్వర్యంలో రాళ్లను తొలగించారు. ఆలయ భూమికి సరిహద్దులు గుర్తించారు. ఈ భూమిని ఆక్రమిస్తే చట్ట రీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేశారు.





