News

పకడ్బందీగా చందనోత్సవం

246views

విశాఖపట్నం జిల్లా సింహాచలం క్షేత్రంలో ఈ నెల 30న అప్పన్నస్వామి నిజరూప దర్శనం, చందనోత్సవాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ప్రకటించారు. ఉత్సవ నిర్వహణపై సింహాచలంలో మంత్రుల కమిటీ సమీక్ష నిర్వహించింది. ఈ సందర్భంగా ఆనం మాట్లాడుతూ.. చందనోత్సవం రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సమేతంగా స్వామిని దర్శించుకుని పట్టువస్త్రాలు, చందనం సమర్పిస్తారని పేర్కొన్నారు. సుమారు 1.50 లక్షల మంది భక్తులు నిజరూప దర్శనానికి వస్తారన్న అంచనాతో పటిష్ఠ ఏర్పాట్లు చేయనున్నట్లు వెల్లడించారు. వేకువజామున 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు సామాన్య భక్తులకు నిరంతరాయంగా దర్శనాలు కల్పిస్తామని చెప్పారు. ఈ ఏడాది స్వామిని దర్శించుకున్న ప్రతి భక్తుడికీ ఉచితంగా చిన్నలడ్డూ ప్రసాదం పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.