News

ఆవులు తరలిస్తున్న వాహనాలు సీజ్‌

249views

శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి సమీపంలో అక్రమంగా ఆవులను తరలిస్తున్న రెండు వాహనాలను సీజ్‌ చేసినట్లు ఎస్‌ఐ బి.హైమావతి తెలిపారు. కొత్తూరు మండలంలోని బలద సంత నుంచి విజయ నగరం జిల్లా అలమండకు అక్రమంగా ఆవులు తరలిస్తున్నట్లు భజరంగదళ్‌ సభ్యులు ఇచ్చిన సమా చారం మేరకు అలికాం-బత్తిలి రహదారిపై తనిఖీలు నిర్వహించినట్లు చెప్పారు. ఈ మేరకు ఆవులు తరలిస్తున్న వ్యక్తులపై కేసు నమోదు చేసి, వాహనాలు సీజ్‌ చేసినట్లు తెలిపారు. కాగా రెండు వాహనాల్లో ఉన్న తొమ్మిది ఆవులను విజయనగరం జిల్లా గుర్ల మండలంలోని గుజ్జంగవలసలో ఉన్న గోశాలకు తరలించినట్లు చెప్పారు.

అక్రమంగా తరలిస్తున్న పశువుల స్వాధీనం
మరోవైపు కోటబొమ్మాళిలోని నారాయణవలస సమీపం నుంచి లారీలో 13 ఆవులను అక్రమంగా తరలిస్తున్న సమాచారంతో ఎస్ఐ వి.సత్యనారాయణ తన సిబ్బందితో కలిసి పట్టుకున్నారు. వీటిని విజయనగరం జిల్లా కొత్తవలస గోశాలకు తరలించారు. ఆవులను అక్ర మంగా తరలిస్తున్న వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.