
258views
దేశంలో మతమార్పిళ్ల అంశమై దాఖలైన పలు పిటిషన్లపై ఈ నెల 16న సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. బలవంతపు మత మార్పిళ్ల నుంచి రక్షణ కలిగించాలని కొందరు పిటిషనర్లు విజ్ఞప్తి చేయగా, పలురాష్ట్రాలు అమలు చేస్తోన్న మతమార్పిడి నిరోధక చట్టాలను వ్యతిరేకిస్తూ మరికొందరు సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కె.వి. విశ్వనాథన్ ధర్మాసనం ముందుకు ఈ పిటిషన్లు రానున్నాయని సుప్రీం కోర్టు వెబ్ సైట్ ద్వారా తెలిసింది.





