News

ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ

347views

ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం ఉప్పకపాడు గ్రామంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కేంద్ర భారీ పరిశ్రమల సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారి కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, ఛత్రపతి శివాజీ వారసత్వం భారతీయుల హృదయాల్లో పదిలంగా వుందని అన్నారు. శివాజీ మహారాజ్‌ ఒక ఆదర్శవంతమైన పాలకుడని చెప్పారు. ఛత్రపతి శివాజీ మహారాజ్‌ గారి విలువలు, ధైర్యం, దేశభక్తి ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిగా నిలవాలన్నారు. శివాజీ మహారాజ్‌ దేశంలోని గొప్ప పాలకులలో ఒకరని, దేశానికి నిజమైన రూపశిల్పి ఆయనే అని కొనియాడారు.